మెగా స్టార్ చిరంజీవి, నటరత్న బాలకృష్ణ మధ్య పోటి అంటే బాక్సాపీస్ దగ్గర ఎప్పుడు మజానే ఉంటుంది. బాలయ్యా, చిరు ఇప్పటి వరకు 30 సార్లు పోటి పడ్డారు. అందులో 8 సార్లు వీరిద్దరి సినిమాలు సంక్రాంతి బరిలో పోటి పడ్డాయి. వీరిద్దరు చివరి సరిగా 2017లో తమ కేరియర్‌లోనే ప్రతిష్ఠత్మంగా తెరకెక్కిన సినిమాలతో బాక్సాపీస్ దగ్గర పోటి పడి ఇద్దరు విజయం సాధించారు. మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్ళా తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఖైధి నెంబర్ 150 ( ఇది చిరు కెరీర్‌లో 150వ సినిమా) సినిమా, బాలయ్య వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి 2017 సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఈ రెండు సినిమాలు విజయం సాధించాయి.
ఈ రెండు సినిమాలో చిరు ఖైదీ సినిమాకు ఎక్కువగా వసూళ్లు రాగా… బాలయ్యా శాతకర్ణి సినిమాకు ఎక్కువ ప్రసంసలు వచ్చాయి. ఇక వీరిద్దరి మధ్య పోటీలో తొమ్మిదో నెంబర్ ఒక సెంటిమెంట్‌గా మారడం విశేషం. వచ్చే సంక్రాంతిగి చిరంజీవి, బాలకృష్ణ తొమ్మిదో సారి పొంగల్ బరిలో పోటికి దిగుతున్నారు. ఆసలు నెంబర్ 9 ఇద్దరి హీరోల పోటీలో ఎలా కీ రోల్ పోషించిందో ఒక్కసారి చూద్దం. చిరంజీవి, బాలకృష్ణ తొలిసారి 1984 సెప్టెంబర్‌లో బాక్సాపీస్ దగ్గర పోటికి దిగారు.
సెప్టెంబర్ తొమ్మిదో నెల.. అ నెల 7వ తేదిన బాలయ్య మంగమ్మ గారి మనవడు రిలిజ్ కాగా, 14న చిరింజీవి ఇంటిగుట్టు రిలిజ్ అయ్యింది. అలా వీరిద్దరి మధ్య తొలిపోరులో బాలయ్యాదే పైచేయి అయింది. చిరు, బాలయ్య తొలిసారి సంక్రాంతి బరిలో 1987లో ఢీకొన్నారు. ఆ యేడాది చిరంజీవి దొంగమొగుడు, బాలయ్య భార్గవరాముడుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దొంగమొగుడు 1987 జనవరి 9న రిలీజ్ కాగా ఇక్కడ తేది 9. అప్పుడు చిరంజీవిదే పైచేయి అయింది.
ఇక సంవత్సర సంఖ్యలో తొమ్మిది విషయానికి వస్తే 1998లో మొత్తం కూడితే తొమ్మిది వస్తుంది. ఆ యేడాది చిరంజీవి బావగారు బాగున్నారా ఏప్రిల్ 9న రీలిజ్ కాగా, బాలయ్య యువరత్న రాణా ఏప్రిల్17న వచ్చింది. అప్పుడు కూడా చిరంజీవి సినిమాదే పైచేయి అయింది. అయితే బాలయ్య రాణాకు మంచి ప్రశంసలు దక్కాయి. తేదీ, నెల, సంవత్సరం ఇలా ఈ మూడు ఫార్మాట్లోనూ 9 కీ రోల్ ప్లే చేసింది.
ఇక రెండు 99లు ఉన్న 1999లో జనవరి 1న చిరు స్నేహంకోసం, 13న బాలయ్య సమరసింహారెడ్డి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అప్పుడు బాలయ్యదే పై చేయి అవ్వడంతో పాటు సమరసింహారెడ్డితో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇక ఇప్పుడు వచ్చే పొంగల్‌కు 9వ సారి సంక్రాంతి పోటీకి రెడీ అవుతున్నారు. మరి ఈ సారి ఎవరు పై చేయి సాధిస్తారో ? చూడాలి.