ప్రజెంట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టఫ్ ఫైట్ నెలకొందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య వీరసింహారెడ్డి అనే పేరుతో సంక్రాంతి కానుకగా బరిలో దిగారు. అదే మూమెంట్లో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే పేరుతో రంగంలోకి దిగడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద ఇద్దరు బడా హీరోలు ఒకే టైం కి పోటీ పడుతుండడం సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ జోరుగా నడుస్తుంది.
కాగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఆధారంగా ..”వాల్తేరు వీరయ్య” సినిమాకు నెగిటివ్ ప్రమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వాల్తేరు వీరయ్య సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి పాట ..ప్రతి అప్ డేట్ అన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు . అదేవిధంగా వీరసింహారెడ్డి నుంచి వచ్చిన ప్రతి పాటను..ప్రతి అప్ డేట్ ని హైప్ క్రియేట్ చేసి బజ్ ని క్రియేట్ చేశారు.
ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు చిరంజీవి అంటూ తెలుస్తుంది . కావాలనే కొందరు సోషల్ మీడియాలో పనిలేని బ్యాచ్ వాల్తేరు వీరయ్య పై నెగిటివ్ ప్రమోషన్స్ చేస్తున్నారని ..చిరంజీవి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఇదే విషయంగా చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ విషయంలో సొంతగా తన నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారట . ఏది ఏమైనా సరే వాల్తేరు వీరయ్య – వీర సింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద ఎలా ఉండబోతుందో అని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి సంక్రాంతి రేసులో ఎవరు విన్ అవుతారో.. బాలయ్య నా..? చిరంజీవినా..?