సినిమా ఇండస్ట్రీలో గొడవలు.. తగాదాలు.. పోట్లాటలు చాలా కామన్ . స్టార్ హీరో హీరోయిన్ల మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్లకున్న స్టార్ స్టేటస్ దృష్ట్యా ..అవి బయటికి రావు ..బయటికి వచ్చిన వాటిపై అఫీషియల్ ప్రకటన చేయరు . ఎంతోమంది హీరో హీరోయిన్ మధ్య గొడవలు జరిగి వాళ్ళు మాట్లాడుకోకుండా ఉన్న విషయం తెలిసిందే. పబ్లిక్ ఈవెంట్లో సైతం చిన్నపిల్లల్లా ఎడ ముఖం పెడ ముఖం పెట్టుకొని మీడియాకు అడ్డంగా దొరికిపోయిన స్టార్ సెలబ్రిటీస్ ఎంతోమంది ఉన్నారు .
ప్రజెంట్ అలానే చేసిన నయనతార బీహేవీయర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా నటించిన కనెక్ట్ మూవీ ప్రమోషన్స్ కోసం తెలుగు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది . ఈ క్రమంలోనే హోస్ట్ గా నయనతారను తనదైన స్టైల్ లో ఆటపట్టించి అలరించి అసలు మేటర్ ను రాబట్టింది.
పదేళ్లుగా ఎప్పుడెప్పుడు మీడియాకు దొరుకుతుందా అంటూ వెయిట్ చేసాము నయనతార అని సుమ చెప్పుకోరావడం హైలైట్ గా మారింది . కాగా ఇదే క్రమంలో తెలుగులో స్టార్ హీరోస్ తో తన వర్క్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న నయనతార.. ఓ హీరో గురించి సుమ అడిగినా సైతం రెస్పాండ్ అవ్వలేదు . దీంతో ఆ వీడియోని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజెన్స్ .
బాలకృష్ణ – ప్రభాస్ – ఎన్టీఆర్ -చిరంజీవి -వెంకటేష్ అందరి పేర్లు చెప్పుకొచ్చింది . అయితే తాను మరో హీరోతో కూడా నటించింది . ఆ హీరో గురించి ప్రస్తావనే తీసుకురాలేదు . సుమ పరోక్షకంగా హీరో గురించి ప్రశ్నించిన నయనతార స్కిప్ చేస్తూ మాటలు మార్చేసింది. దీంతో ఆ హీరోతో నయనతార గొడవలు నిజమే అంటూ క్లారిటీకి వచ్చేసారు . జనాలు ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.