Moviesమొగుడికే ఫైర్ పెట్టిన నయన్..ఆ విషయంలో మారకపోతే కష్టమేనా..?

మొగుడికే ఫైర్ పెట్టిన నయన్..ఆ విషయంలో మారకపోతే కష్టమేనా..?

వామ్మో ..కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఇంత మొండిదా..? ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్లో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార .. ప్రజెంట్ సౌత్ లోనే క్రేజీ హీరోయిన్గా ట్యాగ్ చేసుకుంది . అంతేకాదు ఇప్పటివరకు ఏ సౌత్ హీరోయిన్ అందుకోని రెమ్యూనరేషన్ అందుకుని.. ఏకంగా ఒక్కొక్క సినిమాకు పది కోట్లు చార్జ్ చేస్తుంది .

అంతేకాదు లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే నయనతార ..రీసెంట్గా చేసిన సినిమా కనెక్ట్ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్ టేష్న్స్ ఉన్నాయి. ఆ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానుల్ని మరింత ఆకట్టుకునింది . సెకండ్ సెకండ్ సస్పెన్స్ తో కొనసాగే ఈ ట్రైలర్.. సినిమా పై హై ఎక్స్ పెక్ టేషన్స్ పెంచేసింది. ఈ సినిమా నయన్ భర్త సొంత బ్యానర్ పైనే తెరకెక్కింది.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని.. నయనతార పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నయనతార తన సినిమా ప్రమోషన్స్ కి రాదు…తన సినిమాని ప్రమోట్ చేసుకోదు. ఈ విషయం సినిమా కమిట్మెంట్ ఇచ్చే ముందే చెప్పేస్తుంది . ఈ క్రమంలోని సొంత భర్త బ్యానర్ లో తెరకెక్కిన సినిమాకి సైతం ప్రమోషన్స్ చేయలేదు. దీంతో ఈ సినిమా రిజల్ట్ పై సర్వతా ఉథ్కంట నెలకొంది. భర్తకే మార్క్ షాక్ ఇచ్చిందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి . అంతేకాదు విగ్నేష్ శివన్ నయనతారను ప్రమోట్ చేయమని అడిగిన నో చెప్పిందట . ఇదే క్రమంలో కోలీవుడ్ లో వీరిద్దరి పేర్లు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . ఒకవేళ నయనతార తన పద్ధతి మార్చుకోకపోతే సినిమా లైఫ్ లోనే కాదు మ్యారీడ్ లైఫ్ లోను కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు జనాలు. చూడాలి మరి ప్రమోషన్స్ చేయని ఈ కనెక్ట్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news