సోషల్ మీడియా వల్ల మంచితో పాటూ చెడు కూడా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా సెలబ్రెటీల పై ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది. సెలబ్రటీలు ఏం చేసినా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ వారిని ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా బాడీ షేమింగ్ చేస్తూ వారిని అవమానపరచడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది నటీమణులు తాము బాడీ షేమింగ్ ను ఎదురుకున్నట్టు వెల్లడించారు.
కొన్ని రోజుల క్రితం యాంకర్ అనసూయ తనను ఆంటీ అని పిలుస్తున్నారు అని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఎంతో అందంగా ఉండే హీరోయిన్ నందిత రాజ్‌ను సైతం కీచకులు వదిలిపెట్టలేదు. నందిత టాలీవుడ్ లో చానా సినిమాలలో నటించారు. ఇదిలా ఉంటే నందిత రాజ్ ను కూడా కొంతమంది కేటుగాళ్లు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ చేశారు. దాంతో నందిత రాజ్ వారికి ఘాటుగా స్పందిస్తూ దిమ్మ తిరిగే రీప్లే ఇచ్చారు.
నందిత గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోకు ఓ నెటిజన్ ప్లీజ్ మీరు మీ అందం పై దృష్టి పెట్టండి….మీ షేపులు చూడండి ఒకసారి ఆంటీలా తయారు అవుతున్నారు. అంటూ కామెంట్స్ చేశారు. దానికి హీరోయిన్ స్పందించాడమే కాకుండా గట్టి కౌంటర్ ఇచ్చారు. సదరు నెటిజన్ కామెంట్ చేసిన స్క్రీన్ ను షాట్ షేర్ చేశారు. ఆ స్క్రీన్ షాట్ కు…. ఇలాంటి వారి వల్ల ఎంత నరకం ….మనుషుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని కామెంట్స్ చేశారు.
నేను ఏమైనా దేవత నా నాకు కూడా బాధలు ఉంటాయి…..ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు. నేను నా బాడీని ప్రేమిస్తున్నా ఎలా ఉన్నా కనిపించినా ప్రేమిస్తూనే ఉంటాను..ఎప్పుడు ఎలా ఉండటానికి ఇష్టపడతానో అలాగే ఉండటానికి ఇష్టపడతా అని చెప్పారు. ఆ కామెంట్ చూసిన నెటిజన్లు మళ్లీ షాక్ అయ్యారు. చాలా అంది నందిత చేసిన కామెంట్స్ కు సపోస్ట్ చేశారు. చాలా బాగా బుద్ది చెప్పావ్…అమ్మాయి అంటే బాడీ షేవింగ్ చేసేవాల్లకి బుద్ది వస్తుందని పేర్కొన్నారు.