ఏ మాటకు ఆ మాటే వయసుతో సంబంధం లేకుండా నందమూరి నట సిం హం బాలకృష్ణ చేస్తున్న డ్యాన్స్ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది . మనకు తెలిసిందే ఫాన్స్ సంతోషం కోసం బాలయ్య ఏమైనా చేస్తాడు. ఎంత కఠినమైన స్టెప్స్ అయినా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి జనాలను మెప్పిస్తాడు. ప్రజెంట్ దాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు . బాలయ్య ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా వీరసింహారెడ్డి. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత మళ్లీ మరో మాస్ సినిమాతో మనం ముందుకు రాబోతున్నాడు.
గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో వీరసింహారెడ్డి అనే పేరుతో జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో సందడి చేయనున్నాడు బాలయ్య . కాగా ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహం ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పటికే మొదటి సాంగ్ జై బాలయ్య అంటూ రిలీజ్ చేసి సోషల్ మీడియాని షేక్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా కొద్ది సేపటి క్రితమే సుగుణ సుందరి అంటూ సినిమాలో ఉండే మాస్ రొమాంటిక్ సాంగ్ ని లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయిన ఈ పాట లిరిక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జనాలను ఆకట్టుకుంటున్నాయి. మరి ముఖ్యంగా ధమన్ బీట్ అదిరిపోయింది అని చెప్పాలి . పాట వింటుంటే మనలో మనకే తెలియని వైబ్రేషన్స్ కలిగి కాళు కదుపుతున్నాం. ఈ సాంగ్లో బాలయ్య వేసిన స్టెప్స్ చూస్తే ఖచ్చితంగా ఇరగదీసాడు అన్న మాట అనకుండా ఉండలేం . ఈ వయసులోనూ యంగ్ హీరోస్ తో పోటీ పడుతూ ఇంకా పక్కాగా చెప్పాలంటే యంగ్ హీరోస్ కూడా వేయలేని స్టెప్స్ ను అవలీలగా వేసేసాడు .
అయితే ఈ పాట చేస్తున్న టైంలో బాలకృష్ణకు ఎక్కువగా జ్వరం ఉండిందట . అయినా కానీ లొకేషన్ షాట్స్ మిస్ కాకూడదని బాడీ సహకరించక పోయినా సరే తన బాడీని కంట్రోల్ చేసుకొని కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చెప్పినట్లు డాన్స్ చేశారట . అందుకే ఈ సాంగ్ బాలకృష్ణకు చాలా ప్రత్యేకమని ..ఈ సినిమాలో అన్నిటికన్నా బాలయ్యకి ఇష్టమైన సాంగ్ ఇదే అంటూ కూడా ఓ న్యూస్ వినిపిస్తుంది. ఏది ఏమైనా సరే సినిమా అనౌన్స్ చేసి రెండు మూడేళ్లయిన తెరపైకి తీసుకురాని యంగ్ హీరోస్ ఉన్న మన ఇండస్ట్రీలో ..అభిమానుల కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయని బాలయ్య లాంటి హీరోలు కూడా ఉండడం గర్వించితగ్గ విషయం అనే చెప్పాలి.