టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోస్ ఉన్నారు . అయితే వాళ్ళందరిలోకి ప్రత్యేకం అక్కినేని నాగార్జున. ఆయన పై ఎంతో మంది ట్రోళ్ చేస్తున్నారు. సామ్-చై విషయంలోను వల్గర్ గా మాట్లాడారు. అయితే, ఎప్పుడు కూడా అలాంటి వాటికి కౌంటర్ ఇవ్వలేదు నాగర్జున . అయితే ఎందుకో తెలియదు గానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో నాగార్జున టంగ్ స్లిప్ అయ్యి అడ్డంగా బుక్ అయ్యాడు.
మనకు తెలిసిందే భారీ అంచనాల మధ్య స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ త్వరలోనే ముగియనుంది . ఈ క్రమంలోని హౌస్ లో ఉండే కంటెస్టెంట్లు మధ్య ఫైర్ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పటిలాగే ఈ వారం వీకెండ్ నాగార్జున తనదైన స్టైల్ లో గేమ్స్ ఆడించి సరదాగా నవ్వించి సందడి చేశారు. ఇది ఇలా ఉంటే హౌస్ లో నాగార్జున షో మధ్యలో చేసిన కామెంట్ ఆసక్తికరంగా మారింది .
ఈ గేమ్ హోస్ట్ చేస్తున్న మధ్యలో నాగార్జున లేడీ కంటెస్టెంట్స్ కి ఫేవర్ గా మాట్లాడారు . దీంతో ఆ మాటలను ఎవరైనా తప్పుగా తీసుకుంటారో అనుకున్నాడో ఏమో ..మళ్లీ ఆ మాటలకు అర్థం చెబుతూ..”నాకు అమ్మాయిలంటే పక్షపాతం అంతే ..బలహీనత కాదు” అంటూ మరో సీరియస్ స్టేట్మెంట్ ను స్ట్రాంగ్ గా చెప్పుకొచ్చాడు. దీంతో ఎవ్వరు అడగకుండా నాగార్జున అంత స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేశాడు అన్నది చర్చనీయాంశంగా మారింది . గతంలో నాగార్జునకు అమ్మాయిలు పిచ్చి ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. బహుశా ఈ విధంగా వాటికి కౌంటర్ ఇచ్చుంటాడేమో నాగార్జున అంటూ జనాలు అభిప్రాయపడుతున్నారు.