Moviesపబ్ లు, పార్టీలు వద్దు..నీహారిక కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మెగా...

పబ్ లు, పార్టీలు వద్దు..నీహారిక కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మెగా హీరో..!?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉండే ముద్దుగుమ్మలను ట్రోల్ చేయడం సహజం. స్టార్ సెలబ్రిటీస్ ని ట్రోల్ చేయడం కామన్ . అయితే కొందరు పనిలేని బ్యాచ్ మాత్రం ఎప్పుడు మెగా ఫ్యామిలీ పై పడి మెగా డాటర్ లను మెగా హీరోలను సోషల్ మీడియాలో వేపుకు తింటూనే ఉంటారు . కాగా మరోసారి అలాంటి ట్రోలింగ్ బాధలకు గురవుతుంది నిహారిక . మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ..కెరియర్ స్టార్టింగ్ లో హీరోయిన్గా చేసిన విషయం తెలిసిందే . ఆ తర్వాత తనకు సినిమాలు సెట్ అవ్వవు అని గ్రహించి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.

అంతేకాదు పెళ్లి తర్వాత ప్రొడ్యూసఅర్ గా మారి పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ ..తనదైన స్టైల్ లో ముందుకెళ్తున్న నిహారిక ..రీసెంట్గా మెగా ఫ్యామిలీలో సిక్రేట్ శాంట ను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే మెగా ఫ్యామిలీకి సంబంధించిన అందరూ పాల్గొన్న ఈ సెలబ్రేషన్స్ లో నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య మాత్రం కనిపించలేదు . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో నీహారికను ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . కాగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న న్యూస్ ప్రకారంగా.. నిహారిక పబ్బులు ,పార్టీలు చేసుకోవడం జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీకి ఇష్టం లేదని ..వాళ్లది చాలా డీసెంట్ ఫ్యామిలీ అని ..ఇలా పార్టీలు అంటూ తిరిగితే వాళ్ల పరువు పోతుందని నిహారికకు ఆల్రెడీ చైతన్య చెప్పుకొచ్చారట .

అయినా ఆమె వినకుండా పుట్టింటి పార్టీ కోసం వచ్చినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది . ఇదే క్రమంలో గతంలో డ్రగ్స్ విషయంలో కూడా నిహారిక పై పలువురు లేనిపోని వార్తలు సృష్టించి నిహారిక పరువు తీశారు . ఆ టైంలో కూడా మెగా హీరో వరుణ్ తేజ్ నిహారిక కు సివియర్ వార్నింగ్ ఇచ్చారట . పద్ధతి మార్చుకోకపోవడంతో వరుణ్ తేజ్ కూడా నిహారికపై ఫైర్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు నిహారిక ఏ విధంగా స్పందించకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news