మాస్ మహారాజా రవితేజ ఈ యేడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచాడు. ఖిలాడి – రామారావు ఆన్‌డ్యూటీ రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఈ ఏడాది చివర్లో ముచ్చటగా మూడోసారి ధమాకా సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఈరోజు ధమాకా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. శ్రీలీల హీరోయిన్గా నటించగా నక్కిన త్రినాధరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే టీజర్, ట్రైలర్లు ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో రవితేజ హిట్ కొడతాడని ఎక్కువ ? మంది ఆశలు పెట్టుకున్నారు.
మరోవైపు ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్రకారును హీటెక్కిస్తున్న శ్రీలీలా తన అందచందాలతో మత్తెక్కించబోతుందని టీజర్, ట్రైలర్లతో పాటు ఈ సినిమా స్టిల్స్ కూడా చెప్పేసాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్లు కూడా రవితేజ భారీ ఎత్తున చేస్తున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు.. పాన్ ఇండియా అంటూ వెంటపడుతున్న హీరోలపై రవితేజ తన మార్క్ సెటైర్లు వేశాడు.
పాన్ ఇండియా అనేది నా దృష్టిలో వేరుగా ఉంటుంది.. భారీ రిలీజ్ దానికి సరిపోదు… ప్రతిదీ పాన్ ఇండియా సినిమా అయిపోదు.. నా సినిమాల్లో టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా సినిమా అవుతుంది.. పాన్ ఇండియా సినిమా అవ్వాలంటే కథలు… బలమైన కంటెంట్ ఉండాలని రవితేజ తన అభిప్రాయం వెల్లడించాడు. అలాగే కాంబినేషన్లపై కూడా మాట్లాడుతూ తనకు కాంబినేషన్ అంటే నమ్మకం ఉండదని.. కథను మాత్రమే నమ్ముతానని.. కథ నచ్చకుండా కాంబినేషన్ కుదిరిందని చేయటం తన వల్ల కాదని కుండ బద్దలు కొట్టేశాడు.
అయితే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కథ, కథనాలతో సంబంధం లేకుండా భారీ ఎత్తున పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్నాయి. ఇలా భారీగా రిలీజ్ అయిన కొన్ని సినిమాలు బొక్క బోర్లా కూడా పడుతున్నాయి ఈ హీరోల సినిమాలను దృష్టిలో ఉంచుకునే రవితేజ ఇలా సెటైర్లు వేశారన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.