ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా గత పదివేలుగా టాలీవుడ్ లో తన హవా నడిపిస్తున్నారు దిల్ రాజు. నైజంలో పంపిణీదారుడుగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం.. ఈరోజు అటు పంపిణీర రంగంలోనూ.. ఇటు సినీ నిర్మాణ రంగంలోనూ తిరుగులేని స్థాయికి చేరుకుంది. ఈరోజు టాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ కావాలన్నా… ఎంత పెద్ద హీరో సినిమాకు… ఏ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ జరగాలన్నా కూడా తెరవ వెనక ఎంతో కొంత దిల్ రాజు ప్రమేయం ఉండాల్సిందే. ఆ స్టార్ హీరో సినిమాకు కావలసిన థియేటర్లు కేటాయించే విషయంలోనూ రాజు హ్యాండ్ ఉండాల్సిందే.
చివరకు ఏ సినిమాకు ఏ రేటు డిసైడ్ కావాలనేది కూడా ఈ సిండికేట్ నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్ళందరి తరఫున టోటల్‌గా చక్రం తిప్పుతుంది కూడా దిల్ రాజే అంటున్నారు. అయితే సురేష్ బాబు – ఆసియన్ సునీల్ తలుచుకుంటే నైజాంలో దిల్ రాజుకు గట్టి పోటీ ఇవ్వవచ్చు. అయితే వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా బిజినెస్ విషయంలో రిస్క్ చేసేందుకు ఇష్టపడరు అన్న టాక్‌గ్ ఉంది. దీంతో దిల్ రాజుకు తిరుగులేకుండా పోతుంది. కేవలం డిస్ట్రిబ్యూషన్ లో మాత్రమే కాదు.. ఇప్పుడు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో కూడా దిల్ రాజు పై తీవ్రమైన అసంతృప్తి రగులుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా కొంచెం కొంచెం దిల్ రాజును దూరం పెట్టటం ప్రారంభిస్తున్నారని చర్చలు జరుగుతున్నాయి. సర్కారు వారిపాట సినిమా టైంలో దిల్ రాజు పద్ధతి మహేష్ బాబుకు కోపం తెప్పించింది అన్న ప్రచారం జరిగింది. తన సినిమాకు మంచి కలెక్షన్లు ఉండగానే థియేటర్లు తగ్గించేసి.. అలవైకుంఠపురం సినిమాకు ఇవ్వడం మహేష్‌కు ఎంత మాత్రం నచ్చలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. తన తర్వాత సినిమా హక్కులు దిల్ రాజుకు ఇవ్వటానికి వీలులేదని నిర్మాతకు మహేష్ ముందే చెప్పేసారట.
ఇక ఎన్టీఆర్‌కు ఎందుకనో ముందు నుంచే దిల్ రాజు పై పెద్దగా గురిలేదని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటాయి. పటాస్ సినిమాను నైజాంలో పంపిణీ చేయాలని దిల్ రాజు చేతిలో పెట్టారు. అయితే వచ్చిన కలెక్షన్లకు… దిల్ రాజు చెప్పిన లెక్కలకు ఎన్టీఆర్.. కళ్యాణ్‌రామ్ ఇద్దరి మైండ్ బ్లాక్ అయిపోయిందని టాక్. కారణం పూర్తిగా తెలియకపోయినా ఎన్టీఆర్ దిల్ రాజును పెద్దగా నమ్మడని అంటారు. ఇక బన్నీ కూడా రేపో ఎల్లుండి దిల్ రాజును దూరం పెట్టటం ఖాయమని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం దిల్ రాజు చేతిలో ఉన్న పెద్ద సినిమా రామ్ చరణ్ – శంకర్ సినిమా మాత్రమే. ఇక మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయే తప్ప ఏది ముందుకు వెళ్లడం లేదు. చివరికి దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసేందుకు కూడా టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి మిడిల్ రేంజ్ హీరోల వరకు ఎవరు ఆసక్తి చూపటం లేదని అంటున్నారు. ఇక నైజాంలో మైత్రీ వాళ్లు కొత్తగా పంపిణీ సంస్థ స్టార్ట్ చేస్తున్నారు. ఇది రాజుకు ఎంతో కొంత పోటీ ఇస్తుంది. అసలు ఒకప్పుడు హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నైజాంలో స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్.
అసలు ఈ రోజు ఆయన రేసులో వెనక్కు వెళ్లిపోయాడు. వరంగల్ శ్రీను లాంటి వాళ్లు దిల్ రాజుకు ఎదురు వెళ్లినా మనోడు చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో వరంగల్ శ్రీను కూడా డల్ అయిపోయాడు. వైజాగ్‌లో గాయత్రి ఫిలింస్ దిల్ రాజుకు గట్టి పోటీ ఇస్తోంది. ఇక నైజాంలో పండగ సినిమాలు వీరయ్య, వీరసింహా రెండూ కూడా మైత్రీ వాళ్లు ఓన్ డిస్ట్రిబ్యూషన్. ఇవి రెండు హిట్ అయ్యాయంటే రాజుకు చాలా వరకు చెక్ పడిపోతుంది.
ఒక వేళ కాలం కలిసిరాక ఇవి సక్సెస్ కాకపోతే మళ్లీ రాజుదే హవా అవుతుంది. ఇక బాలయ్య వీరసింహారెడ్డి రిలీజ్ రోజునే దిల్ రాజు వారసుడు వస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా మంది బాలయ్యకు మద్దతుగా గొంతులు వినిపిస్తున్నారు. ఇప్పటికే నట్టి కుమార్, వరంగల్ శ్రీను లాంటి వాళ్లు దిల్ రాజుపై ఓపెన్‌గానే విమర్శలు చేస్తున్నారు. మైత్రీ వాళ్లతో పాటు స్టార్ హీరోలతోనూ రాజుకు గ్యాప్ వస్తోన్న సంకేతాలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో స్టార్ ప్రొడ్యుసర్ సీ కళ్యాణ్ సైతం దిల్ రాజును తూర్పారబట్టారు.
సీ కళ్యాణ్ అయితే గిల్డ్ మీద నిప్పులు కక్కారు. అటు సురేష్‌బాబు సైతం ఇప్పుడు తన కోపం చూపించబోతున్నాడని అంటున్నారు. ఇక బాలయ్య, చిరంజీవి సినిమాలకు థియేటర్లు ఇవ్వకపోతే థియేటర్ల దగ్గర ధర్నాలు, అలజడులు చేయడానికి ఈ ఇద్దరు హీరోల అభిమానులు కాచుకుని ఉన్నారు. ఏదేమైనా దిల్ రాజు ఇప్పుడు అందరికి టార్గెట్ అవుతున్నారు. మరి ఇకపై టాలీవుడ్ రాజకీయం అయితే రంజుగా మారేలా ఉంది.