హీరోయిన్ బొడ్డు బావుందనో..ఇంకేదో బావుందనో సినిమా తీస్తాం.. అంటున్న స్టార్ డైరెక్టర్. అవును సినిమాకి కావాల్సిన అన్నీ కమర్షియల్ అంశాల కంటే హీరోయిన్ గ్లామర్ చాలా ఇంపార్టెంట్. అందుకే కమర్షియల్ సినిమాలు, ఫ్యాన్ బేస్డ్ సినిమాలు మన సౌత్‌లో బాలీవుడ్ కంటే ఎక్కువగా తయారవుతుంటాయి. మరీ ముఖ్యంగా మన టాలీవుడ్‌లో మాస్ హీరోలు ఎక్కువ.
వారికి ఉండే మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతాకాదు. అందుకే నిర్మాత సినిమా ప్లాన్ చేస్తే పక్కా కమర్షియల్ సినిమాలనే ప్లాన్ చేస్తుంటాడు. దర్శక రచయితలు ఆ తరహా కథలనే తయారు చేస్తుంటారు. హీరో మేకోవర్ అదే ధోరణిలో ఉంటుంది. పక్కా మాస్ హీరో..పక్కా గ్లామర్ హీరోయిన్ అనే రెండు ప్రధానమైన అంశాలు మన టాలీవుడ్‌లో పూరి జగన్నాథ్ సినిమాలలో కనిపిస్తుంది.
అలాగే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. వీరిద్దరూ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసినవారే. ఆయన సినిమాల ప్రభావం బాగా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్‌ను వీలైనంత గ్లామర్ క్వీన్‌గా చూపించడంలో ఎవరి స్టైల్ వారిదే. అయితే, సినిమాను ఇప్పటి సోషల్ మీడియా జనాలు చిటికెలో చంపేస్తున్నారు. ఏమీ తెలియని వాడు కూడా రివ్యూ రాసి చంపేస్తున్నాడు.
దర్శకుడు సినిమా సక్సెస్ కోసం హీరోయిన్ మీద బాగా ఫోకస్ చేస్తాడు. ముఖ్యంగా హీరోయిన్ అందాలు బొడ్డు, ఎద భాగం, పెదవులు, నడుము లాంటి సెక్స్ అపీల్‌ను ఎక్కువగా చూపించాలనుకుంటాడు. ఇవి జనాలను ఆకర్షించడానికే. కానీ, ఒకే ఒక్కసారి సినిమా చూసి కథ, కథనం మీద పట్టు లేకపోయినా ఫ్లాప్ అని ప్రచారం చేసి మంచి సినిమాను ప్రేక్షకులకి చేరకుండా చేస్తున్నారు.