Moviesబట్టలు లేకుండా నగ్నంగా నిల్చో పెట్టాలి.. కన్నడ హీరో షాకింగ్ కామెంట్స్..!!

బట్టలు లేకుండా నగ్నంగా నిల్చో పెట్టాలి.. కన్నడ హీరో షాకింగ్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక ప్రతి మాటను మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆచి తూచి నిర్ణయించుకొని మాట్లాడాలి . పొరపాటున మాట్లాడిన తెలియక మాట్లాడిన ఆ తర్వాత దాని కారణంగా వచ్చే ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది . ప్రజెంట్ అదే పొజిషన్లో నలిగిపోతున్నారు కన్నడ స్టార్స్ రష్మిక మందన్నా, మాస్ హీరో దర్శన్ . మనకు తెలిసిందే కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టి పై పరోక్షకంగా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో దుమారం రేపుతున్నాయో.

అంత ఎందుకు కన్నడ ఇండస్ట్రీనే ఆమెను బ్యాన్ చేయడానికి రెడీగా ఉంది అంటే ఆ మాటలు ఎంత హర్టింగ్ గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాగా ప్రజెంట్ ఆలిస్ట్ లోకే మరో స్టార్ హీరో చేరినట్లు తెలుస్తుంది . కెమెరా అసిస్టెంట్ గా పరిశ్రమకు పరిచయమైన దర్శన్.. ఆ తర్వాత చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ 2001లో విడుదలైన మెజిస్టిక్ సినిమాతో హీరోగా బ్రేక్ తీసుకున్నాడు . ఆ తర్వాత కన్నడ పరిశ్రమలో తనదైన స్టైల్ సినిమాలో చేస్తున్న దర్శన్.. రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వల్గర్ కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

దర్శన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”అందరూ అదృష్ట దేవత తలుపు తట్టిందా అంటూ ఉంటారు ..ఈసారి అలా తలుపు తడితే చేయి పట్టుకొని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి ఆమెను బట్టలు విప్పేసి నగ్నంగా ఉంచండి. అప్పుడు ఆమె బట్టలు లేకుండా బయటకు రాలేదు కదా.. అదృష్ట దేవత ఎప్పుడు మీతోనే ఉంటుంది ..బట్టలు విప్పేస్తే బయటకు వెళ్ళిపోతుంది అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు”. అయితే ఈ ఫన్నీ కామెంట్ సీరియస్ గా తీసుకున్నారు జనాలు. హిందువుల అదృష్ట దేవత ను శ్రీలక్ష్మి గా భావిస్తారు ..అలాంటి లక్ష్మిని విష్ణుమూర్తి భార్యగా పూజించే జనాలకు ఈ కామెంట్స్ హర్టింగ్ గా అనిపించాయి . ఈ క్రమంలోని ఆయనపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని మహిళా సంఘాలు కూడా ఫైర్ అవుతున్నారు . ఈ క్రమంలోని కన్నడ ఇండస్ట్రీలో దర్శన్ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి . ఇలా రష్మిక మందన అలాగే దర్శన్ ఇద్దరు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం తో కన్నడ ఇండస్ట్రీకు కొంచెం నెగిటివ్ గా మారుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news