సినిమా ఇండస్ట్రీలోకి నాన్న పేర్లు, తాతలు పేర్లు చెప్పుకొని ఎంతోమంది హీరోస్ వచ్చారు. చాలా తక్కువ మందే నాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు . వాళ్ళల్లో ఒకరే ఈ శృతిహాసన్ మల్టీ టాలెంటెడ్ లోకనాయకుడు గా పేరు సంపాదించుకున్న కమలహాసన్ ముద్దుల కూతురు . నిజానికి శృతిహాసన్ ఏనాడు సినిమా ఇండస్ట్రీలో తన తండ్రి పేరు చెప్పుకొని అవకాశాలు అందుకోలేదు . అందుకే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దాదాపు 5ఏళ్ళు ఒక హిట్టు కొట్టకుండా అల్లాడిపోయింది . ఆ తర్వాత ఆమె పాలిట దేవుడు లా మారాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .
హరిశంకర్ డైరెక్టర్ గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించి మొదటి హిట్‌ను రుచి చూసింది . ఈ సినిమా హిట్ తర్వాత అమ్మడు ఖాతాలో అవకాశాలు మరింతగా పెరిగి బాలీవుడ్ , కోలీవుడ్ , టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా మారింది. అయితే కెరియర్ పిక్స్ లో ఉండగానే ఓ హీరోతో ప్రేమలో పడిన శృతిహాసన్ ..ఆ హీరో తో హద్దులు మీరి నటించింది . నటించడమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా రెచ్చిపోయి రొమాన్స్ చేసింది అంటూ జనాలు చెప్పుకొచ్చారు . అంతేకాదు వీళ్ళు ప్రైవేటుగా దిగిన కొన్ని ఫోటోలు సైతం సోషల్ మీడియాలో అప్పట్లో హల్చల్ చేశాయి. కాగా ఈ క్రమంలోనే అతగాడు కమల్ హాసన్ ఇంటి అల్లుడు కాబోతున్నాడని కోలీవుడ్ మీడియా సైతం ప్రచారం చేసింది.
అయితే అతడు అల్లుడుగా రావడం ఇష్టం లేని కమలహాసన్ నిజస్వరూపం తెలిసేలా కూతురు కళ్ళు తెరిపించాడు . అతడికి గతంలో ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి.. ఎంత మందితో ఇల్లీగల్ ఎఫైర్ మైంటైన్ చేశాడు ..అన్న విషయాలను పటాపంచలు చేశాడు . ఈ క్రమంలోనే అతగాడితో బ్రేకప్ చెప్పేసుకున్న శృతి ..మరో బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసింది . అంతేనా అతగాడికి బ్రేకప్ చెప్పేసి ప్రజెంట్ ఇంకో బాయ్ ఫ్రెండ్ తో కులుకుతుంది …డేటింగ్ లో ఉంది .. ఈ మధ్యనే సోషల్ మీడియాలో అతగాడికి బ్రేకప్ చెప్పేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
ఇలాంటి టైంలో కమలహాసన్ పై కొందరు నెటిజన్స్ మండి పడుతున్నారు. అల్లుడు క్యారెక్టర్ గురించి పక్కనపెట్టి కూతురు క్యారెక్టర్ గురించి ఎంక్వయిరీ చేసి ఉంటే బాగుండేది అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. అంతేకాదు గర్ల్ ఫ్రెండ్ ఉందని అల్లుడిని రిజెక్ట్ చేసిన ఈ హీరో కాబోయే అల్లుడు కూతురుకి ఎన్ని ఎఫైర్స్ ఉన్నాయి అని ఎంక్వయిరీ చేస్తే పరువు పోదా అంటూ మండిపడుతున్నారు . ఏది ఏమైనా సరే శృతిహాసన్ తండ్రి పేరుని ఎంత పెంచిందో తెలియదు కానీ ..తండ్రి పేరుని మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది.