ప్రస్తుతం ప్రయోగాలు చేయాలంటే రాజమౌళి అయితే ఒకప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు చేయాలకు పెట్టింది పేరుగా సింగీతం శ్రీనివాస రావు ఉండేవారు. ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలో సింగీతం శ్రీనివాసరావు తన టాలెంట్ తో అద్భుతాలను సృష్టించారు. సింగీతం శ్రీనివాసరావు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తరవాత సైన్స్ ఫిక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమానే ఆదిత్య 369..ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించారు.
ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో వచ్చిన మొదటి టైం ట్రావెల్ ఈ సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రంతో బాలయ్య విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సినిమాల్లో బాలయ్య తన పాత్రలలో పరకాయ ప్రవేశం చేశాడు. అయితే ఈ సినిమా తెరవెనక జరిగిన చాలా విషయాలు ప్రేక్షకులకు తెలియదు. దర్శకుడు సింగీతం మొదట ఈ సినిమా కథను విమానంలో ప్రయాణిస్తున్న సంధర్బంలో ఎస్పీ బాలసుభ్రమణ్యంకు వినిపించారు.
కథ విన్న తరవాత ఆయన చాలా భాగుందని మెచ్చుకున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత జంద్యాల సంభాషణలు రాశారు. అంతే కాకుండా ఈ సినిమాలో బాలయ్యకు శ్రీకృష్ణదేవరాయులు పాత్ర సూపర్ గా సెట్ అవుతుందని జంద్యాల చెప్పారు. ఇక ఈ సినిమాలో నటుడు చంద్రమోహన్ తెనాలి రామకృష్ణుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా విలన్ గా అమ్రిష్ పురి నటించాడు.
ముఖ్యమైన పాత్ర కృష్ణ కుమార్ పాత్ర కోసం మొదట కమల్ హాసన్ ను సింగీతం శ్రీనివాస రావు అనుకున్నారు. అంతే కాకుండా కమల్ హాసన్ కు కథను కూడా వినిపించారు. అయితే కమల్ హాసన్ తన డేట్స్ సర్దుబాటు కావడం లేదని నో చెప్పారు. అయితే ఆ తరవాత ఎస్పీ. బాలు సింగీతం శ్రీనివాసరావుతో మాట్లాడుతూ…ఆ పాత్ర కూడా బాలయ్యతో వేయిస్తే బాగుంటుందని సూచించారు. అలా బాలయ్య ద్విపాత్రాభినయం చేయాల్సి వచ్చింది. ఇక బాలయ్య ఎక్కడా తగ్గకుండా నటవిశ్వరూపం ప్రదర్శించిన సంగతి తెలిసిందే.