వివి వినాయక్ – మెహర్ రమేష్ – మోహనరాజా – బాబి వీళ్ళందరూ వాళ్ళ చిన్నతనంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసి ఆయనకు వీరాభిమానులు అయ్యారు. అసలు వీరు కలలో కూడా తమ అభిమాన హీరోను డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందని ఊహించి ఉండరు. అలాంటిది ఈ నలుగురు డైరెక్టర్లు అనూహ్యంగా చిరంజీవిని డైరెక్ట్ చేశారు. తాజాగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాను గుంటూరుకు చెందిన చిరు వీరాభిమాని కె ఎస్ రవీంద్ర ( కొల్లు బాబి ) డైరెక్ట్ చేశారు.
ఈ సినిమా ప్రెస్‌మీట్ ఈవెంట్‌లో బాబి మరోసారి చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
ఈ సందర్భంగా బాబి చెప్పిన ఒక ఫోటో స్టోరీ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తాను కూడా కచ్చితంగా ఇండస్ట్రీలోకి వచ్చేయలని బాబి డిసైడ్ అయ్యాడట. ఇంద్ర రిలీజ్ అయిన వెంటనే బాబి హైదరాబాద్ వచ్చి ఆ సినిమాకు కథ అందించిన రచయిత చిన్ని కృష్ణును కలిసాడట.
తాను కూడా ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటున్నట్టు చిన్ని కృష్ణకు చెప్పాడట. అయితే చిన్నికృష్ణ పట్టించుకోకపోవడంతో 30 రోజులపాటు చిన్ని కృష్ణ వెంట పడడంతో… చివరకు ఆయన బాబిని తన దగ్గర అసిస్టెంట్‌గా పెట్టుకొన్నాడట. ఆ సమయంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మిగిలిన అభిమానులతో కలిసి రక్తం ఇవ్వడానికి వెళ్ళాడట. అప్పుడు బాబీతో పాటు అక్కడ 50 మందికి పైగా అభిమానులతో చిరంజీవి ఫోటోలు దిగారట. అయితే బాబి ఒకసారి చిరంజీవితో ఫోటో దిగాక… రెండోసారి మళ్లీ చిరంజీవితో ఫోటో కోసం వెళ్లాడట.
అయితే చిరంజీవి బాబిని గుర్తుపట్టి కాస్త కోపంగా చూస్తూ ఫోటో వైపు చూడు అని కసురుకున్నారట. అలా చిరంజీవితో తాను తీయించుకున్న ఫోటోలో ఆయన చాలా కోపంగా కనిపిస్తారని బాబి నాటి సంగతిని గుర్తు చేసుకున్నాడు. అయితే అంతకుముందు తనతో చిరు నవ్వుతూ తీయించుకున్న ఫోటో మాత్రం మిస్ అయిందని… తన దగ్గర కోపంగా ఉన్న ఫోటోనే మిగిలిపోవడంతో చిరంజీవి కోపానికి కారణం ఏంటని ? చాలామంది తనను ప్రశ్నించినట్టు బాబి చెప్పాడు.
అయితే పవన్ కళ్యాణ్‌తో సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా పంపినప్పుడు చిరు సెట్స్‌కు వస్తే పవన్ ప్రోత్సాహంతో తాను చిరుతో ఫొటో దిగానని గుర్తు చేసుకున్నారు. బాబి ఇలా చెపుతుండగానే చిరు బాబి దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకుని నవ్వుతూ ఫొటోగ్రాఫర్లకు సైగ చేశాడు. అక్కడితో ఆగకుండా బాబికి గట్టిగా ఓ ముద్దు కూడా ఇచ్చేశాడు.