సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య కాంపిటీషన్ ఉండడం సర్వసాధారణం. అలా కాంపిటీషన్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి కంటెంట్ ఉన్న స్టోరీలు ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఆ కాంపిటీషన్ అనేది హెల్దిగా ఉండాలి ..పగలు, కుట్రలు, కుతంత్రాలు వరకు వెళ్లకూడదు. కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా-అల్లు వార్ ఎక్కువగా వినిపిస్తుంది . అల్లు అరవింద్ కి చిరంజీవి అంటే లెక్క లేదని పాన్ ఇండియా హీరో ఇమేజ్ రాగానే కొంచెం ఎక్కువగా చేస్తున్నాడని మెగా ఫాన్స్ అయిన పై మండిపడుతున్నారు .
ఇదే క్రమంలో అల్లు ఫ్యాన్స్ కూడా మెగా హీరోస్ పై ఘాటుగా రిప్లై ఇస్తున్నారు . ఎటువంటి హెల్ప్ లేకుండా పాన్ ఇండియా స్టార్ట్ అయిపోయాడని మెగా హీరోస్ కి కుళ్ళు అని అందుకే అల్లు అర్జున్ పై ఇలా లేనిపోనివి క్రియేట్ చేసి అతనిని ట్రోల్ చేస్తున్నారని అల్లు ఫాన్స్ కూడా ఓ రేంజ్ లో మెగా ఫాన్స్ పై విరుచుకుపడుతున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎప్పుడు మెగా వ్స్ అల్లు ఫ్యాన్స్ వార్ జరుగుతూనే ఉంటుంది . కాగా ఈ గొడవల్లో స్టార్ డైరెక్టర్ ను తీసుకొచ్చి ఆ డైరెక్టర్ ని ఏకంగా బ్రోకర్ అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది .
మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలు స్టార్ట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు అల్లు అర్జున్- రామ్ చరణ్ తో కలిసి సినిమాలు తీశాడు . ఈ క్రమంలోనే రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు మెగా హీరోస్ ఆ డైరెక్టర్ ను ఫ్యామిలీ చర్చల్లోకి లాగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సినిమాలో ఓ మెగా హీరోకి కీలక పాత్ర ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే నిన్న మొన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే హీరోలను తెరపై కలపడానికి చూడడం ఏంటో అంటూ జనాలు షాక్ అయ్యారు .
ఈ క్రమంలోనే క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా మెగా వ్స్ అల్లు వార్ అన్న వార్తలు వినిపిస్తున్న టైంలో మెగాస్టార్ చిరంజీవి ఆ స్టార్ డైరెక్టర్ కు ఫోన్ చేసి వీళ్ళ కాంబో ని సెట్ చేసినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే సినిమా డైరెక్టర్ ను బ్రోకర్ గా మార్చేశారని కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే అంత మంచి డైరెక్టర్ ని బ్రోకర్ అనే మాట తీసుకోలేకపోతున్నారు ఆ డైరెక్టర్ ఫ్యాన్స్ . ఇలా ఇద్దరి ఫ్యామిలీ మధ్య వచ్చిన గొడవల్లో అడ్డంగా బుక్ అయ్యి ఇరుక్కుపోయాడు ఈ స్టార్ డైరెక్టర్ అంటూ జాలి చూపిస్తున్నారు జనాలు.