సమంత, విజయ్ దేవరకొండ..ఎవరి వల్ల ఎవరికి నష్టం కలగబోతుందీ అనేది ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం వీరిద్దరూ జంటగా ఓ రొమాంటిక్ మూవీ చేస్తుండటమే. మజిలీ, ఓ బేబీ లాంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తర్వాత మళ్ళీ సమంతకి హిట్స్ దక్కలేదు. బాలీవుడ్లో చేసిన ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2 వెబ్ సిరీస్ సమంతకి మంచి క్రేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే.
దాంతో ఆ తర్వాత నటించిన సినిమాల మీద మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ, ఇప్పటివరకూ రిలీజ్ అయిన సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. వాస్తవంగా ఇటీవల వచ్చిన యశోద సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకుంది సమంత. కానీ, అనూహ్యంగా ఆ మూవీ ఫ్లాప్‌గా మిగిలింది. యశోద సినిమాలో సమంత నటనకు మంచి మార్కులే పడినా కూడా సినిమా కమర్షియల్‌గా క్లిక్ కాలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న శాకుంతలం సినిమా పరిస్థితేంటో ఇంకా తెలియదు.
ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత కొన్నేళ్ళుగా వరుస ఫ్లాపులను మూటగట్టుకుంటున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి చేసిన మొదటి పాన్ ఇండియా సినిమా. భారీగా అంచనాలున్నాయి. కానీ, ఫలితం ఇలా వస్తుందని ఎవరూ ఊహించలేదు. లైగర్ విజయ్ పరువు మొత్తం పోయేలా చేసింది.
ఇప్పుడు అటు విజయ్ దేవరకొండకి గానీ, సమంతకి గానీ ఉన్న నమ్మకాలనీ కలిసి చేస్తున్న ఖుషి సినిమా మీదే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈపాటికే రిలీజ్ అనుకున్న సినిమానూ అనుహ్యంగా పోస్ట్‌పోన్ చేశారు. మళ్ళీ రీ షూట్ చేస్తున్నారట. ఇద్దరూ ఒకరిమీద నమ్మకంతో ఒకరు చేస్తున్నారు. కానీ, ఇద్దరి టైం బ్యాడ్‌గానే ఉంది. మరి ఎవరివల్ల ఎవరికి ప్లస్ అవుతుందో ఖుషి సినిమా రిలీజైతేగానీ తేలదు.