అవును..! విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు… బహు పిసినారి..! ఎంగిలి చేత్తో కాకిని తోలేవారుకాదు..! నమ్మేద్దాం.. నమ్ముదాం.. కూడా! కానీ, వాళ్లలా కాలేకపోయారు !! ఇదే ఎన్టీఆర్‌ను ప్రజల్లో నిలబెట్టింది. కొన్నాళ్ల కిందటి సంగతిని గమనిస్తే.. ఒక నటుడు (పేరు చెబితే బాగోదు) హైదరాబాద్‌లో చనిపోయారు.
అప్పటికే ఆయనకు తీవ్ర అనారోగ్యం. వైద్యం చేయించేందుకు డబ్బులు లేవు. కానీ, ఎన్టీఆర్ కన్నా.. గొప్పగా.. నటించారనే పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. పోరాడి.. పొట్లాడి.. మరీ అధిక రెమ్యునరేషన్‌లు తీసుకున్నారనే పేరు కూడా ఉంది. డామిట్.. చివరి రోజుల్లో.. వద్దులే! ఆయనను అవమానించినట్టు అవుతుంది. మరో మహానటి! అందరికీ తెలిసిన కథే..!
మరో కత్తి వీరుడు.. ఇది కొంచెం చెప్పుకోవాలి. పిల్లులు ఎదుగుతున్నారు.. వారికి ఏం చేస్తున్నావ్?! అని అన్నగారు అడిగితే..మనదంతా.. ఫారిన్ స్టయిల్..! ఎవరి జీవితాలు వారివే..! అని చెప్పిన ఆ ధీశాలి.. కుటుంబ పరిస్థితి ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఇంతకన్నా చెబితే.. అన్నం తినలేం..!
మరో నటీమణి.. ఫారిన్ చెప్పులు.. ఫారిన్ కార్లలో (ఇప్పుడు కాదు.. సుమా) తిరిగిన సంగతి నాటి తరానికి తెలిసిందే. కానీ, చివరి రోజుల్లో గుడి మెట్లు.. కడగడాలు.. తుడవడాలు. అబ్బ! గుండెలు పిందేసే వేదన. కానీ, ఎన్టీఆర్ ఆలా కాలేక పోయారు. అందరి ముందు.. పెట్టే విషయంలో ఆయన చిన్నవాడు కావొచ్చు(నాటి ఇండస్ట్రీలో) కానీ, ఇప్పటికీ.. ఎప్పటికీ.. అదో మహానగం! మహా మనీషి!! అలా ఉండాలని కాదు.. ఉన్నారు కాబట్టే.. ఇప్పుడు నిలబడ్డారు.