నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ నడుస్తుందో అందరికీ తెలిసిందే . పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టి పై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి..ఆమెను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయాలి అని ఆలోచన వరకు వెళ్ళాయి వీళ్ల గొడవలు.
అప్పుడెప్పుడో రిషిబ్ డైరెక్షన్లో ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక ..ఆ తర్వాత ఆయనతో వచ్చిన గొడవలు కారణంగా కాంతారా సినిమాను చూడలేదు అంటూ బయటపెట్టింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో భూతద్దంలో పెట్టి చూసారు కొందరు రిషబ్ శెట్టి అభిమానులు. అంతేకాదు మొదటి నుంచి రష్మిక మందన అంటే కన్నడ ఇండస్ట్రీలో పడని ఓ హీరోయిన్ ..ఆమె పై పగ తీర్చుకోవడానికి చూస్తూ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .
ఈ క్రమంలోనే రష్మిక ని బ్యాన్ చేయాలి అంటూ కన్నడ ప్రజలు సరికొత్త డిమాండ్ తెరపైకి తేవడంతో ఆమె ఏకంగా అలాగే జరిగితే గుండు కొట్టించుకుంటా అంటూ ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొచ్చిందట. అసలే పీకల్లోతు కోపంలో ఉన్న రష్మిక మందనకు.. ఆమె చేసిన కామెంట్లు మరింత గా పుండు మీద కారం చల్లిన్నటు అనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే రష్మిక మందనను బ్యాన్ చేసే ఆలోచన కన్నడ ఇండస్ట్రీకి ఉందో లేదో తెలియదు కానీ.. ఈమె మాత్రం ఆ జనాలను మరింత రెచ్చగొడుతూ ..రష్మిక ని బ్యాన్ చేసే విధంగా పోస్టులు పెడుతున్నట్లు కన్నడ మీడియా చెప్పుకొస్తుంది .
ఏది ఏమైనా సరే రష్మిక మందన బ్యాన్ అవుతుందేమో అని కొందరు బాధపడుతుంటే.. ఈ హీరోయిన్ మాత్రం ఫుల్ జోష్ లో పార్టీలు చేసుకుంటుంది. ఆల్రెడీ రష్మిక బ్యాన్ పై కన్నడ సినీ పరిశ్రమ ఓ నిర్ణయం తీసుకున్నట్లు ..త్వరలోనే అది అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది అంటూ కన్నడ మీడియా రాసుకుంది. ఏది ఏమైనా సరే రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.