రాధికా ఆప్టే. ఈ పేరు వింటే రక రకాల జోనర్ సినిమాలు గుర్తొస్తాయి. తెలుగులో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన రక్త చరిత్ర 1 అండ్ 2 చిత్రాలతో బాగా పాపులర్ అయింది. ఈ సినిమాలో రాధిక ఆప్టే చాలా నేచురల్‌గా కనిపించి టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. కానీ, ఈ సినిమా తర్వాత వెంటనే సినిమా అవకాశం తెలుగులో రాలేదు.
ఈ గ్యాప్‌లో కొన్ని హిందీ సినిమాలలో నటించి ఆకట్టుకుంది. చెప్పాలంటే బాలీవుడ్లో రాధిక ఆప్టే హాట్ బ్యూటీగా మంచి పాపులర్ అయింది. ఇక హాలీవుడ్ సినిమాల సంగతి అందరికీ తెలిసిందే. ఓ సినిమాలో ఏకంగా కింద భాగం మొత్తం చూపించింది. ఇంకో సినిమాలో జాకెట్ లేకుండా కనిపించి పెద్ద దుమారమే రేపింది. ఇలా సౌత్‌లో, బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న ఏ హీరోయిన్ సెమీ న్యూడ్‌గా నటించలేదు.
ఇదే విషయం రాధిక ఆప్టేతో చర్చిస్తే ఆమె కళ్ళు తిరిగిపోయే సమాధానం చెప్పింది. మీరు కింద భాగాన్ని చూపించడం ఇబ్బంది అనిపించలేదా..? అని అడిగితే, కళ్ళు..ముక్కు..చెవులు నా ఒంట్లో భాగమే. కెమెరా ముందు వాటిని చూపించినప్పుడు నా స్థానాలను, కిది భాగాన్ని చూపించడంలో తప్పేముంది. కథ డిమాండ్ చేసింది కాబట్టే నా ఒంట్లో అలాంటి భాగాన్ని చూపించాలంటే కూడా అభ్యంతరం అనిపించలేదు..అని చెప్పింది.
ఇలా చెప్పడం ఒక్క రాధిక ఆప్టేకే చెల్లింది. ఇక రాధిక నటించిన ఈ న్యూడ్ సీన్స్‌ను ప్రేక్షకులు యూట్యూబ్‌లో ఇప్పటికీ చూస్తుంటారు. రాధిక మాత్రం ఇలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఎన్నో సందర్భాలలో ఇచ్చి హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇక రాధిక తెలుగులో సీనియర్ హీరో బాలయ్య పక్కన లెజెండ్, లయన్ సినిమాల్లోనూ నటించింది. ఇందులో లెజెండ్ బ్లాక్‌బస్టర్. అయినా కూడా ఆమె కెరీర్ టాలీవుడ్లో అనుకున్న రేంజ్లో కొనసాగలేదు.