టాలీవుడ్ స్టార్ కథానాయిక సమంత రూత్ ప్రభు నాగచైతన్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి డల్‌గానే ఉంటూ వస్తోంది. రీసెంట్‌గా యశోద లాంటి పాన్ ఇండియా హిట్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్లోకి వచ్చేసింది. యశోద సినమాలో సమంత పెర్పామెన్స్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. యశోద సమంత కెరీర్‌కు మంచి ఊపు వచ్చింది. సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఫ్రూవ్ అయ్యేలా చేసింది. ఇక డిసెంబర్లో సమంత గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
అయితే సమంతకు స్కిన్ డిసీజ్ ప్రాబ్లమ్ వచ్చిందన్న వార్తలు వస్తున్నాయి. సమంత తాను ఓ వ్యాధితో బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. ఈ క్రమంలోనే శాకుంతలం డిసెంబర్లో వస్తుందా ? లేదా ? ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అవుతుందా ? అన్నది సస్పెన్స్ గానే ఉంది. అయితే సమంత కొన్నాళ్లుగా మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని, డాక్టర్లు తనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆమె చెపుతూనే వస్తోంది.
తాను ఈ వ్యాధి నుంచి బయట పడేందుకు మరి కొంత సమయం కావాలని కూడా ఆమె చెపుతోంది. ఈ టైంలో తన చుట్టూ ఉన్న బంధువుల, స్నేహితులు, శ్రేయోభిలాషులు తనపై చూపిస్తోన్న ప్రేమకు ధన్యవాదాలు అని కూడా చెపుతోంది. వీరు ఇచ్చే ఆత్మవిశ్వాసంతోనే తాను ఈ వ్యాధి నుంచి బయట పడతానని కూడా సమంత చెప్పింది. అయితే గత రెండు రోజులుగా సమంత ఆరోగ్యం మరింత క్షీణించిందంటూ ఒక్కటే సోషల్ మీడియా నుంచి వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలపై సమంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనే ఆమె చైతుకు విడాకులు ఇచ్చినప్పుడు ఆమె క్యారెక్టర్‌ను తగ్గిస్తూ ఘోరంగా వార్తలు రాసిన యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌పై సమంత టీం సైబర్ క్రైం కింద కంప్లైంట్ చేసింది. దీంతో అప్పుడు చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లగా.. కొందరు సమంతను వేడుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి సమంతను టార్గెట్ చేస్తుండడంతో ఆమెలో కోపం నషాళానికి వెళ్లిపోయిందని.. ఆమె చాలా కోపంతో ఉందనే తెలుస్తోంది.
ఇలాంటి చెత్త పనులను, తన క్యారెక్టర్‌ను, వ్యక్తిత్వాన్ని తగ్గించేలా చేస్తే ఎవరైనా ఊరుకునేదే లేదని కూడా సమంత వారికి వార్నింగ్ ఇవ్వడంతో పాటు మరోసారి చర్యలకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సమంత ఆరోగ్యం క్షీణించిందని వస్తోన్న వార్తలపై ఆమె పీఆర్ టీం అయితే ఆ పుకార్లు నమ్మవద్దని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది.