వాల్తేరు వీరయ్య ఆడియె అదిరిపోయిందని.. దేవీ ట్యూన్స్ ఇరగదీశాయని ఎవరు ఎంత డప్పుకొట్టుకుంటున్నా… ఆడియో మాత్రం అనుకున్న స్థాయిలో లేదని స్పష్టంగా తెలుస్తోంది. దేవీ ఇంత దారుణంగా డిజప్పాయింట్మెంట్ చేస్తాడని మెగాభిమానులు కూడా ఊహించనే లేదు. అయితే సినిమాకు ముందు ఈ నెగటివిటిని తట్టుకోవాలంటే ఆల్బమ్ అదిరిపోయిందని కవర్ చేసుకోవాలి.. లేకపోతే సినిమాపై హైప్ ఖఛ్చితంగా డౌన్ అవుతోంది.
మెగాభిమానులు దేవిశ్రీపై వస్తోన్న కోపాన్ని లోపల అదిమిపట్టుకుని.. లోపల పంటి బిగువునే ఆ బాధను భరిస్తూ పైకి మాత్రం పెదాలపై చిరునవ్వుతో బాస్ ఇరగదీశాడు.. అల్బమ్ అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి… దేవి ఇచ్చిన లిరిక్స్ వరస్ట్‌గా ఉన్నా.. ట్యూన్లు పరమ కంపరంగా ఉన్నా కూడా 67 ఏళ్ల వయస్సులో చిరు స్టైలీష్ లుక్‌లు, ఆయన వేసిన డ్యాన్సులకు మాత్రం ఎవడైనా సలాం చేయాల్సిందే.
చిరు ఎఫర్ట్‌ను ఏ మాత్రం తక్కవ చేసి చూడలేం. అసలు ఆ గ్రేస్, ఆ స్టెప్స్ మూమెంట్స్, బాడీని కదిపిన తీరుకు హ్యాట్సాఫ్. అయితే దేవీ మాత్రం ఒక్కో పాట వరుసగా రాడ్‌లు దింపేసుకుంటూ రావడంతో పాటు ఫ్యాన్స్ గుండెల్లో గునపాలు దింపేశాడు. ఇప్పటికే వచ్చిన మూడు సాంగ్స్‌లో ఫస్ట్ రెండు సాంగ్స్‌కు దేవి ఇచ్చిన లిరిక్స్, ట్యూన్స్ ఏం ఆసక్తిగా లేవు. మూడో పాటు జస్ట్ ఓకే.
ఇక తాజాగా దిస్ ఈజ్ నాట్ మాస్ సాంగ్.. దిస్ ఈజ్ మెగా మాస్ సాంగ్ అంటూ దేవి ఇచ్చిన ట్యూన్ పరమదరిద్రంగా ఉందని మెగాభిమానులే తలలు పట్టుకుంటున్నారు. అసలు సోషల్ మీడియాలో ఇతర హీరోల అభిమానులు, ట్రోలర్స్‌ను పక్కన పెట్టేస్తే మెగాభిమానులే దేవీని, ట్యూన్‌ను ట్రోల్ చేస్తూ తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. దేవీ ఏ జాతరలో కొన్నావ్ ఆ పీక ఏంది ఈ దరి ద్రం.. శవాల ముందు తప్పెట్లు కొట్టినట్టు ఉంది ఈ ట్యూన్ అన్న ఘోరమైన కామెంట్లతో ఏకి పడేస్తున్నారు.
అసలు పూనకాలు లోడింగ్ అంటూ గత రాత్రి ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి కొన్ని వేల నెగిటివ్ కామెంట్లు మెగాభిమానుల నుంచే వస్తున్నాయి. వీళ్లకే ట్యూన్ నచ్చక ఈ రేంజ్‌లో నెగటివిటి వచ్చేసింది అంటే ఇక మిగిలిన హీరోల అభిమానులకు, ట్రోలర్లకు దేవీ ఎంత పెద్ద పని పెట్టాడో చెప్పక్కర్లేదు.