టాలీవుడ్‌లో వచ్చే సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే బాక్సాపీస్ దగ్గర వాతావరణం అయితే వేడెక్కిపోయి ఉంది. ఎంత దిల్ రాజు సొంత సినిమా అయినా.. ఎన్ని ఎక్కువ థియేటర్లు వేసినా వారసుడు డబ్బింగ్ సినిమా. ఆ సినిమాకు తెలుగు నాట అంత క్రేజ్ ఉండదన్నది వాస్తవం. ప్రధానంగా పోటీ అంతా వీరసింహాకు, వీరయ్యకు మధ్యే ఉంటుంది. పైగా ఇద్దరు హీరోలు మామూలుగా పోటీ పడితేనే మజా.. అందులోనూ సంక్రాంతి పోరు అంటే అస్సలు ఊహించుకునేందుకే కొత్తగా ఉంది.
ఇప్పటికే రెండు సినిమాల స్టిల్స్, ఫస్ట్ సింగిల్స్, సాంగ్స్, థియేటర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇలా ప్రతి విషయయంలోనూ కంపేరిజన్లు వస్తున్నాయి. పైగా రెండు సినిమాల బ్యానర్ ఒక్కటే. రెండు సినిమాల్లోనూ శృతీహాసనే హీరోయిన్. ఇక ప్రి రిలీజ్ బిజినెస్, సోషల్ మీడియాలో వ్యూస్ కూడా కౌంట్ చేసుకుని ఇద్దరు హీరోల అభిమానులు చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల కలెక్షన్లపై ఇండస్ట్రీలో సరికొత్త బెట్టింగులు మొదలైపోయాయి.
20 ఏళ్ల క్రితం చిరంజీవి మృగరాజు, బాలయ్య నరసింహానాయుడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ తరహా బెట్టింగులు జరిగాయి. అప్పట్లో రెండు సినిమాల్లో ఏది ఎక్కువ సెంటర్లలో 50 రోజులు ఆడుతుంది ? ఏది ఎక్కువ సెంటర్లలో 100 రోజులు ఆడుతుంది అన్నదానిపై బెట్టింగులు జరిగాయి. ఈ పోటీలో నరసిహానాయుడిదే విజయం. ఇక ఇప్పుడు ఫస్ట్ డే ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వస్తాయి ? అలాగే ఫస్ట్ వీక్‌లో ఎక్కువ కలెక్షన్లు ఎవరివి ? ఫైనల్ కలెక్షన్లు ఎవరికి ఎక్కువ వస్తాయన్నదానిపై ఈ బెట్టింగులు నడుస్తున్నాయి.
హైదరాబాద్ తర్వాత ఏపీలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఇవే బెట్టింగులు ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నాయి. ఈ బెట్టింగుల్లో ఎవరు పై చేయి సాధిస్తారన్న ఉత్కంఠ ఉండగానే.. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండడం కూడా ఆందోళనకు దారితీస్తోంది. కరోనా కేసులు పెరిగి రేట్లు తగ్గినా, ఆక్యుపెన్సీ తగ్గినా అందరూ నిండా మునిగి పోవాల్సిందే..!