సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టాక ..మనకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని సందర్భాలలో ఇష్టం లేని పనులు చేయాల్సి ఉంటుంది . అలా చాలామంది హీరోయిన్స్ చేస్తేనే స్టార్ హీరోయిన్స్ గా మారారు . అయితే అలా తప్పుడు పనులు చేసిన అందరూ తప్పు చేశామని ఒప్పుకోరు.. అలా ఒప్పుకున్న వారు చాలా గ్రేట్ అని చెప్పాలి . అయితే తాజాగా తను చేసిన తప్పు పనిని అందరి ముందు చెప్పి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది తెలుగు అమ్మాయి అంజలి .
అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..పేరుకు తెలుగు అమ్మాయినే.. అయినా కోలీవుడ్లో సినిమాలు చేస్తూ అక్కడ పాపులారిటీ దక్కించుకోని..ఆ క్రేజ్ తో తెలుగులో అవకాశాలు దక్కించుకుంది . ఇదే క్రమంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఫస్ట్ బ్రేక్ ను అందుకుంది. కాగా అంజలి ఇన్నాళ్ల తన కెరియర్లో ఎన్నో సినిమాలు చేసింది. ఎన్నో ఫ్లాప్ లు అందుకుంది. హిట్లు చాలా తక్కువ రుచి చూసింది .
అయితే రీసెంట్ ఇంటర్వ్యూలు అంజలి మాట్లాడుతూ..”మన జీవితంలో మనకు ఇష్టం లేకపోయినా కొన్ని పాత్రలో నటించాల్సి వస్తుంది .. అలా నటించినప్పుడు మనం భరించలేమని ..నేను కూడా ఎన్నో తప్పుడు క్యారెక్టర్లు ఇష్టం లేకుండానే నటించానని.. ఆ తర్వాత కార్ వ్యాన్ లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చానని చెప్పుకోచ్చింది”. దీంతో ప్రస్తుతం అంజలి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఇంతకీ అసలు అంజలికి ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకున్న ఆ హీరో ఎవరో అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.