మెగాస్టార్ చిరంజీవి ఆయన టాలీవుడ్‌లో ఓ బ్రాండ్. అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. ఆయన సినిమాల్లో ఎప్పటకీ నెంబర్ వనే.. ఎప్పటకీ మకుటం లేని మారాజే. పదేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి కూడా .. అందులోనూ ఓ రీమేక్ సినిమాలో నటించి మరీ బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. అదే ఖైదీ నెంబర్ 150. ఆ సినిమా కథ, కథనాలు గొప్పగా లేకపోయినా.. చిరును పదేళ్ల తర్వాత చూస్తున్నాం అన్న ఆనందంతో ఫ్యాన్స్‌తో పాటు మెగాభిమానులు అందరూ కలిసి సూపర్ హిట్ చేశారు.
అక్కడితోనే చిరు ప్రభ ఆగిపోయింది. ఆ తర్వాత చేసిన సినిమాలు.. సినిమాల రిలీజ్‌కు ముందు ఆయన చెపుతోన్న మాటలు.. భవిష్యత్తులో ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తుంటే మాత్రం ఆయన్ను ఆయన వీరాభిమానులు నమ్మే పరిస్థితి లేదు. ఒకప్పుడు తన సినిమాల విషయంలో కావచ్చు.. టాలీవుడ్‌కు సంబంధించి చిరు ఏదైనా ఒక మాట చెపితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందన్న నమ్మకాలు అందరికి ఉండేవి.
అయితే ఇప్పుడు చిరు చెప్పేవన్నీ ఉత్తిత్తే అన్న మాట ఆయన వీరాభిమానుల నుంచే వస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే చిరుపై ఆయన అభిమానులే కస్సుబుస్సు లాడుతున్నారు. చిరు చెప్పేది ఒకటి.. జరుగుతోంది మరొకటి అన్నట్టుగా ఉంది. ఆచార్య సినిమా ప్రమోషన్లలో చిరు బాహుబలి 2ను క్రాస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. కట్ చేస్తే చిరు చరిత్రలోనే ఘోరమైన డిజాస్టర్. అసలు ఈ అవమానం ఇంకా మర్చిపోలేకపోతున్నారు.
ఇక గాడ్ ఫాదర్ టైంలో ఇది తన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందనుకున్నారు. అసలు ఆ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. ముందుగానే హైప్ తక్కువ ఉండేలా చేసినా ఫలితం లేదు. ఇక అంతకుముందు సైరాకు మామూలు హైప్ తేలేదు. అది కమర్షియల్‌గా వాళ్లు అనుకున్న రేంజ్‌కు వెళ్లలేదు. చిరు సినిమాల రిలీజ్‌కు ముందు చెప్పే మాటలకు, తర్వాత రిజల్ట్‌కు సంబంధం ఉండడం లేదు.
ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య వంతు వచ్చింది. ఎన్ని అంచనాలు అయినా పెట్టుకోండి.. ఈ సినిమా ఖచ్చితంగా అందుకుందని చెప్పారు. అయితే చిరు మాటలను ఫ్యాన్స్ లైట్ తీస్కొంటున్నారు. చిరు ఎప్పుడూ ఇదే చెపుతాడు… కానీ అంత సీన్ ఉండదని అంటున్నారు. సరే అభిమానుల నిరాశ ఎలా ఉన్నా వాల్తేరు వీరయ్యతో అయినా చిరు కం బ్యాక్ అవుతారని ఆశిద్దాం..!