మన తెలుగు వాళ్లే తెలుగు సినిమాలలో తెలుగుకు తెగులు పట్టించేస్తున్నారు. తెలుగు పాటలు ఎంతో బాగా రాస్తారని పేరున్న రామజోగయ్య శాస్త్రి లాంటి వాళ్లే పరభాషా పదాలు, తెలుగు మిక్స్ చేసి ఇష్టం వచ్చినట్టు పాటలు రాస్తూ కంపుకొట్టించేస్తున్నారు. ఇక దర్శకులు చేసే పైత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఇక డబ్బింగ్ సినిమాల్లో తెలుగును ఎంతలా చంపేసి తెలుగు పట్టించేస్తారో చూస్తూనే ఉన్నాం.
ఇక పాటలు పాడే సింగర్స్ అయితే ఇష్టం వచ్చినట్టు పాడేస్తున్నారు. అసలు రాసింది పాడింది ఏంటో కూడా సంబంధం ఉండడం లేదు. ఉదాహరణకు యమదొంగ సినిమాలో నువ్వంటే పడి పడి చస్తానే అన్న లైన్‌ను నువ్వంటే పాడి పాడి చస్తానే అన్నట్టుగా పాడేశారు. కీరవాణి లాంటి ట్యాప్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇలాంటి మిస్టేక్‌లు పట్టుకోకపోవడం తెలుగు భాషాభిమానులకు బాధాకరమే.
ఇక ఇటీవల వస్తోన్న యంగ్ డైరెక్టర్లు కమర్షియల్ వాల్యూల కోసం ఇష్టం వచ్చినట్టు డైలాగులు రాసుకుంటూ పోతున్నారు. అసలు తెలుగు భాషలో అన్నీ అక్షరాలు రాని డైరెక్టర్లు కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు అయిపోతున్నారు. పెద్ద లిరిక్ రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు అయిపోతున్నారు. ఇదో పెద్ద జాడ్యం అయిపోతోంది. తాజాగా రిలీజ్ అయిన ధమాకా ట్రైలర్లో శ్రీలీల చెప్పిన ఓ డైలాగ్ కూడా దరిద్రంగా అంటే దరిద్రంగా ఉంది.
శ్రీలీల తన ప్రేమ గురించి చెపుతూ ఒకలు నా ఫ్రెండ్ వాళ్ల అన్నయ్య స్వామి.. ఇంకొకలు నాన్న వాళ్ల ఫ్రెండ్ ఆనంద్ చక్రవర్తి అంటే నీకు ఇద్దరు నచ్చారా అంటే ఆ అంటుంది. ఇక్కడ ఒకలు.. ఇంకొకలు అసలు ఈ పదాలే మనకు తెలుగులో కనిపించవు. ఒకరు – ఇంకొకరు లేదా ఒకళ్లు – ఇంకొకళ్లు అనడం మనం వింటుంటాం. అయితే మరి రైటర్ రాయడంలో తప్పు రాశాడా.. శ్రీలీలకు తెలుగు రాదు కాబట్టి పలకడంలో తప్పు పలికిందో కాని తెలుగు పదాలను కూనీ చేసి తెగులు పట్టించేసింది.
ఎంతో అమాయకమైన ఫేస్‌తో ఒకలు.. ఇంకొకలు అని పలికేసింది. కనీసం ట్రైలర్ కట్ చేసే ముందు డైరెక్టర్‌తో పాటు ఇతరులు అయినా ఇవి చూసుకోలేదు. మరి రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఇలాంటి వినకంపు పదాలు ఇంకెన్ని ఉంటాయో ? శ్రీలీల ఇంకెన్ని పలుకుతుందో ? చూడాలి. ఓవరాల్‌గా అయితే ట్రైలర్ మంచి కమర్షియల్ ప్యాక్డ్ గా కనిపిస్తోంది.