టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఫేమస్ అయిన హన్సిక ..ఎట్టకేలకు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఓ రేంజ్ లో దూసుకుపోతున్న హన్సిక.. కొన్ని వారాల ముందే తన ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టింది . ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సోహెల్ ఖ్తురియాతో ప్రేమలో ఉన్నానని .. అతడు తనకు ప్రపోజ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఐ లవ్ యు టూ అంటూ అఫీషియల్ గా తమ ప్రేమను కన్ఫర్మ్ చేసింది.
అంతేకాదు కొద్ది గంటల ముందే హన్సిక సోహెల్ ఖతురియా చేతులతో తన మెడలో మూడు ముళ్ళు వేయించుకుంది . ప్రజెంట్ దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి . జైపూర్ లోని చారిత్రక కట్టడం ముంటొడా ప్యాలెస్ లో హన్సిక పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది . దీనికి సంబంధించిన పిక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ నే ఉంది .రీసెంట్గా హాల్ది ఫంక్షన్ ఆ తర్వాత సంగీత్ ఫంక్షన్ ఫొటోస్ ను షేర్ చేసిన హన్సిక .. పెళ్లి దుస్తుల్లో కుందనపు బొమ్మల కనిపిస్తుంది.
దేన్నైనా సరే చాలా డిఫరెంట్గా థింక్ చేసే హన్సిక హనీమూన్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం హన్సిక ఏకంగా మూడు వారాలు ఫారిన్ కంట్రీస్ కి హనీ మూన్ ని ప్లాన్ చేసిందట . మొదట మాల్దీవ్స్ కి ఈ జంట హనీమూన్ కోసం వెళ్తున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఇక తర్వాత ఇటలీ , స్విజర్లాండ్ లో కూడా హన్సిక డిఫరెంట్ గా ప్లాన్ చేసిందట . అంతేకాదు ప్రతిసారి ఓ కొత్త ధీమ్ తో డిఫరెంట్ గా తాను ఇష్టపడే ప్రత్యేకంగా డిజైన్ చేయించుకొని మరి ప్లాన్ చేయించుకుందట. ఏది ఏమైనా సరే హన్సిక ప్లాన్ చాలా డిఫరెంట్ గా ఉంది అంటున్నారు జనాలు.