కన్నడ బ్యూటీ సౌందర్య అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే . అందానికి అందం నటనకి నటన. గౌరవానికి గౌరవం. మర్యాదకి మర్యాద . చూడగానే చక్కగా నవ్వుతుంది. అంతే చక్కగా పలకరిస్తుంది . పెద్దవారిని గౌరవిస్తుంది ..అందుకే సినిమా ఇండస్ట్రీలో సౌందర్య లాంటి హీరోయిన్ ఇప్పటివరకు రాలేదు ..ఇకపై రాదు అని ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు . సిన్సియారిటీ ..డెడికేషన్ ..పంచువాలిటికి మారు పేరైన సౌందర్య ..ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.
ఇప్పటివరకు సౌందర్యాన్ని నెగటివ్‌గా చూసే జనాలు.. నెగటివ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోలు లేనే లేరు. ఆమెపై ఒక్కటంటే ఒక్కటి కూడా రిమార్కు లేదు . తల్లిదండ్రులు చెప్పిన పెళ్లి చేసుకోలేదన్న రి మార్క్ తప్పిస్తే మరి ఏ విషయంలోను సౌందర్యాన్ని వేలెత్తి చూపించడానికి ఆస్కారం లేదు . కాగా సౌందర్య సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోల అందరితో చనువుగా ఉంటుంది . ఓ బ్రదర్ లాగా ఓ ఫ్రెండ్ లాగా అన్ని విషయాలను షేర్ చేసుకుంటుంది . కాగా ఇదే క్రమంలో సౌందర్య-చిరంజీవి జంట కూడా తెరపై మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది .
అంతేకాదు చిరంజీవికి సౌందర్య అంటే చాలా ఇష్టం. ఇదే విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . కాగా సౌందర్య – చిరు క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉండేవారట. మరీ ముఖ్యంగా సౌందర్య.. చిరుని ఆటపట్టిస్తూనే ఉండేదట . అన్నయ్య సినిమా షూటింగ్ టైంలో మరింత ఏడిపించడానికి.. ఆమంటే భయపడేటట్లు భయపడినట్లు చిరంజీవి నటించేవాడట . మేడం గారు వస్తున్నారు లేవండి లేవండి అంటూ చేసేవారట . తనకు భయం లేకపోయినా సౌందర్య అంటే భయం ఉన్నట్లు ..సౌందర్య లేడీ టైగర్ అన్నట్లు బిహేవ్ చేసేవారట .
ఈ క్రమంలోని సౌందర్య సైతం చిరుని బాగా ఆటపట్టించేది అన్న న్యూస్ లో అప్పట్లో వినిపించాయి. కాగా హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయింది అన్న న్యూస్ తెలియగానే.. చిరంజీవి ఆ వార్తను నమ్మలేదట ..ఆ తర్వాత అఫీషియల్ గా కన్ఫామ్ చేసుకున్నాక చాలా ఎమోషనల్ గా బాధ పడ్డారట . ఓ మంచి నటి నే కాదు మంచి స్నేహితురాలని కోల్పోయాను అంటూ సురేఖకు చెప్పుకొని కన్నీరు పెట్టారట.