సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అని.. తమ బొమ్మను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవాలి అని ..చాలామంది ముద్దుగుమ్మలకి ఆశగా ఉంటుంది . అయితే వాళ్లలో చాలామంది ఇండస్ట్రీలో జరిగే పనులు భరించలేక.. అలాంటి పనులను చేయడం ఇష్టం లేక ..ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంటారు . కొంత మంది తెగించి మాలో టాలెంట్ ఉంది నేను ప్రూవ్ చేసుకుంటాను అంటూ ముందడుగు వేస్తుంటారు. అలా ముందడుగు వేసిన ప్రతి హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేదు .
ఎంతోమంది ఇండస్ట్రీ లోకి హీరోయిన్ అవ్వాలని వచ్చి ..హిట్ అవ్వలేక ఇండస్ట్రీని వదిలి వెళ్ళలేక వచ్చిన అవకాశాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు . వాళ్ళల్లో ఒకరే ఈ బిగ్ బాస్ బ్యూటీ దివి. సోషల్ మీడియా సెలబ్రిటీగా పాపులారిటీ సంపాదించుకున్న దివి..బిగ్బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది . మొదట హౌస్ లో చాలా మూడిగా ఉన్న ఈ దివి.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో గేమ్స్ ఆడుతూ జనాలను అట్రాక్ట్ చేసింది . కాగా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత దివి పలు క్రేజీ ఆఫర్స్ తో సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోషూట్స్ తో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.
అయితే హీరోయిన్ కి మించిపోయే పర్ఫెక్ట్ ఫిగర్ ఉన్న ఈ దివికి మాత్రం ఇప్పటివరకు హీరోయిన్ గా అవకాశం రాలేదు. అంతెందుకు మొన్నటికి మొన్న గాడ్ ఫాదర్ సినిమాలో ఏకంగా సునీల్ భార్యగా నటించిన దివిని చూసి చాలామంది దివి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు . ఆమెను హీరోయిన్గా చూడాలనుకున్నామని ..ఇలా సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాదని అంటూ మండిపడ్డారు. అయితే దివి అంత అందంగా ఉన్న హీరోయిన్స్ ఆఫర్ రాకపోవడానికి కారణం ఆమె మొండితనం అనే తెలుస్తుంది . కమిట్మెంట్ కి దూరంగా ఉండే దివి హీరోయిన్ గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో కూడా నటించి మెప్పించవచ్చు అంటూ తెగించి ఇలాంటి దివి ఇలాంటి నిర్ణయం తీసుకుందట. చూడాలి మరి ఈ దివి ఏం చేస్తుందో..?