సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. మహిళలు తమ అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు . అంతేకాదు అబ్బాయిలు ఏ విషయంలో తప్పు చేస్తున్నారో కూడా ఫేస్ మీదనే చెప్పి.. వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తున్నారు. అయితే కొందరు స్టార్స్ మాత్రం కేవలం తప్పంతా అమ్మాయిలదే అన్నట్లు మాట్లాడడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . కాగా రీసెంట్గా అలాంటి కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంది నటి రమ్య అలియాస్ దివ్య.
కోలీవుడ్, టాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ..హీరోయిన్గా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గలాన్ని విప్పుతూనే ఉంటుంది .మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ఎక్కడ అన్యాయం జరిగిన గొంతు లేపే మొదటి ఉమెన్ గా ఉండే దివ్య ..రీసెంట్గా దీపికా పదుకొనే బికినీ ఫొటోస్ పై జరుగుతున్న ట్రోలింగ్ గురించి స్పందించింది . అంతేకాదు సోషల్ మీడియాలో విమెన్ ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్ అంటూ సరికొత్త వివాదానికి తెర తీసి సంచలనాన్ని క్రియేట్ చేసింది .
“ప్రతి విషయంలో ఆడవాళ్లదే తప్పంటారా? సమంత విడాకులు తీసుకున్నందుకు ట్రోల్ చేశారు . సాయి పల్లవి తన అభిప్రాయం చెప్పినందుకు ట్రోల్ చేశారు. రష్మిక తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయినందుకు ట్రోల్ చేశారు . ఇప్పుడు దీపిక బికినీ వేసుకున్నందుకు ట్రోల్ చేస్తున్నారు . ఇక్కడ జరిగిన అన్ని విషయాల్లో ఆడవాలనే తప్పంటున్నారు. ఇదే కాదు ఇంకా చాలా విషయాలు అలానే చేశారు. మహిళలే టార్గెట్గా ఎందుకు అందరూ వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. ప్ర్హీడమ్ ఆఫ్బ్ చాయిస్ ప్రతి ఒక్కరు హక్కు కాదా. మహిళలంటే దుర్గామాతకు ప్రతిరూపం అంటారు . మరి మీరు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా ..? ఇలా స్త్రీలపై ద్వేషించే పద్ధతిని అరికట్టాలి ” అంటూ దివ్య తనదైన స్టైల్ స్పందించింది . ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీనిపై నెటిజన్స్ భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు.