సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ మీద జనాలకి రోజు రోజుకీ ఉన్న అభిమానం పోతుంది. శివ లాంటి సినిమాతో సంచలన విజయాన్ని అందుకొని ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయిన వర్మ ఆ తర్వాత ఏ సినిమా చేసిన తమ మార్క్ చూపిస్తూ దర్శకులలో అగ్ర స్థానానికి చేరుకున్నారు. ఆయన సినిమా అంటే ఎంత సంచలనం అవుతుందో అందరికీ తెలిసిందే.
ఎదుటి వాడి అభిప్రాయంతో పనిలేకుండా సినిమా తీసే దర్శకుడు ఒకే ఒక్క రాం గోపాల్ వర్మ. ఎవరి సలహాలు తీసుకోడు. ఎవరి ఇష్టంతో పనిలేదు. నా సినిమా నా ఇష్టం. చూస్తే చూడండి..చస్తే చావండి.. నా చావు నేను చస్తా అనేది వర్మ రూల్, ఫార్ములా. మనసులో అనుకున్నది స్క్రీన్ మీద చూపించడానికి ఏమాత్రం ఆలోచించని దర్శకుడు.
కథలో రా కంటెంట్ ఉండాలి. అదే వర్మ కథా వస్తువు. దాంతో ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఒక స్టేజ్ దాటిన తర్వాత వర్మను జనాలు తిట్టుకోవడం మొదలుపెట్టారు. అయినా లెక్క చేయలేదు. అందుకే, ఆయన నుంచి జీఎస్టీ లాంటి అడల్ట్ మూవీస్ వచ్చాయి. గత ఆరేడేళ్లుగా వర్మ నుంచి ఎలాంటి నాసిరకం సినిమాలు వచ్చాయో చూస్తూనే ఉన్నాం. డేంజరస్ లాంటి లెస్బియన్ మూవీస్ కూడా వచ్చాయి.
ఇలాంటి సినిమాలతో సమాజానికి ఉపయోగం ఏంటీ అని ప్రశించినవారికి తిరిగి కౌంటర్ కూడా ఇచ్చేస్తారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ఇంతకన్నా దారుణంగా దిగజారి అమ్మాయి తొడలను చూస్తూ పాదాల దగ్గర కూర్చొని ఆ పాదాలను నిమురుతూ నోట్లో పెట్టుకొని చప్పరించడం మాత్రం ప్రతీ ఒక్కరికీ అసహ్యాన్ని తెప్పిస్తుంది. అసలు అషురెడ్డిని ఇంటర్వ్యూ చేస్తూ ఆమె కాళ్లను నాకడంతో వర్మ ఎంతకు దిగజారిపోయాడో మరోసారి క్లారిటీ వచ్చేసింది.
అయితే, ఇలాంటి చెండాలాలు వర్మకి జీఎస్టీ తీసినప్పటినుంచే మొదలైందనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. అంతకముందు వరకూ తీసినవన్ని ఫ్యాక్షన్, హర్రర్ సినిమాలు. అందుకే ఆ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా దేశం గర్వించదగ్గ రాంగోపాల్ వర్మ ఇలాంటి చెత్త సినిమాలు, చండాలాలు ఎందుకు తీస్తున్నాడో.