ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లు ఐటమ్ సాంగ్స్ లో స్టెప్పులు వేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్లు మాత్రమే ఐటమ్ సాంగ్ లలో నటించేవారు. కానీ ఇప్పుడు కెరీర్ పీక్స్ లో ఉన్న సమంత లాంటి హీరోయిన్లు సైతం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుని స్పెషల్ సాంగ్స్ లో స్టెప్పులు వేస్తుండటం చూస్తూనే ఉన్నాం. అయితే నైన్టీస్ లో మాత్రం స్పెషల్ సాంగ్ లు చేయడానికి కొంతమంది ప్రత్యేకంగా ఉండేవాళ్లు ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటే జయమాలిని జ్యోతిలక్ష్మి గుర్తుకు వచ్చేవాళ్లు.
అంతే కాకుండా వీళ్లు చేస్తే వ్యాంప్ పాత్రలు లేదంటే ఐటమ్ సాంగ్స్ మాత్రమే చేసేవాళ్లు. కాగా తాజాగా ఓ ఇంటర్యూలో తనకు ఆఫర్లు తగ్గడానికి చిరంజీవి కారణం అంటూ జయమాలిని కామెంట్ చేసింది. అంతే కాకుండా పలు ఆసక్తికర విషయాలను జయమాలిని ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం… జ్యోతిలక్ష్మి తను కలిసి ఒకే గురువు వద్ద డ్యాన్స్ నేర్చుకున్నామని జయమాలిని వెల్లడించింది.
కాగా ఓ రోజు తనను విఠలాచార్య చూసి ఆడదాని అదృష్టం సినిమాలో అవకాశం ఇచ్చారని అదే తన మొదటి సినిమా అని వెల్లడించింది. ఆ తర్వాత జగన్మోహిని సినిమాలో హీరోయిన్ గా నటించగా తనకు ఫుల్ క్రేజ్ వచ్చిందని తెలిపింది. జగన్మోహిని తర్వాత కొన్ని సినిమాలు చేసినా సక్సెస్ అవ్వకపోవడంతో స్పెషల్ సాంగ్స్ చేయడం మొదలు పెట్టినట్టు పేర్కొంది. చాలా సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసినట్టు పేర్కొంది. అంతే కాకుండా తనకు మందు నుంచి పరిచయం ఉన్న ప్రతిభన్ అనే పోలీస్ ఆఫీసర్ ను తాను పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించింది.
పన్నెండేళ్ల వయసులోనే తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టానని తెలిపింది. ఇక పెళ్లి తరవాత కూడా తాను స్పెషల్ సాంగ్స్ చేయాలనుకున్నానని కానీ…అప్పటికి చిరంజీవి డిస్కో డ్యాన్స్ లు..క్లబ్ డ్యాన్స్ లు, బ్రేక్ డ్యాన్స్ లతో ఇరగదీస్తున్నారని తెలిపింది. అలా చిరంజీవి అన్ని రకాల డ్యాన్స్ లు చేయడం వల్ల తనకు అవకాశాలు తగ్గాయని వ్యాఖ్యానించింది. అంతే కాకుండా ఫ్యూచర్ లో ఎప్పుడైనా తాను చిరంజీవిని కలిస్తే ఎందుకు మీరు డ్యాన్స్ లు చేసి మాకు అవకాశాలు లేకుండా చేశారని అడుగుతానని సరదాగా చెప్పుకొచ్చింది.