విజయవాడ రూరల్ మండలలోని నున్న గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న TKR టవర్స్‌లో క్రిస్మస్, 2023 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. TKR టవర్స్‌లో నివసిస్తున్న కుటుంబాలు ఐకమత్యాన్ని ప్రదర్శిస్తూ.. సంయుక్తంగా ఈ వేడుకలకు శ్రీకారం చుట్టాయి. సెమీ క్రిస్మస్ రోజు నుంచి ప్రారంభమైన ఈ వేడుకల్లో చిన్నారులకు ఆటలు, పాటల పోటీలు నిర్వహించారు.
శనివారం రాత్రి 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2023 నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా TKR టవర్స్ కుటుంబాలకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి కొత్త సంవత్సర వేడుకలను ముగించారు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు నాగభూషణం, ఎస్వీఆర్ మోహన్, వెంకటేశ్వరరావు, సీఎస్‌వీ మూర్తి, జ్ఞానానందం, రాజు, ప్రబోధర్‌లు కార్యక్రమాలను నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషించారు.
TKR టవర్స్ రెసిడెంట్స్ నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు బిల్డర్ వెంకట అప్పారెడ్డి, దేవీనగర్ కార్పొరేటర్ జానారెడ్డి, కండ్రిక కార్పొరేటర్ శ్రీరాములు, నున్న గ్రామపంచాయతీ ప్రెసిడెంట్ సరళ, నున్న ఏఈ రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు. ఆటలు, పాటలు, డ్యాన్స్ పోటీల్లో విజేతలైన చిన్నారులకు బహుమతి ప్రదానం చేశారు.