నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ సీనియర్ నటులు. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోటీ ఎంత మజాగా ఉంటుందో చెప్పక్కర్లేదు. వచ్చే సంక్రాంతికి కూడా ఈ ఇద్దరు తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. వాల్తేరు వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి సినిమాల్లో ఎవరి సినిమా పై చేయి సాధిస్తుందన్నది ఆసక్తిగా మారింది. బాలయ్య బుల్లితెరపై ఆహా ఓటీటీలో చేస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్‌కు మంచి పేరు వచ్చింది. ఈ షో ఫస్ట్ సీజన్ ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.
ఇక రెండో సీజన్లో కూడా ఐదు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి – సురేష్‌రెడ్డి – రాధిక ఎపిసోడ్ మినహా అన్ని బాగా క్లిక్ అయ్యాయి. ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు ఎపిసోడ్ బాగా పేలింది. అయితే ఇప్పుడు చిరంజీవి ఈ సీజన్లో గెస్టుగా వస్తున్నాడా ? లేదా ? అన్నదే సస్పెన్స్‌గా ఉంది. ఇప్పటికే అల్లు అరవింద్ చిరును ఇన్వైట్ చేయగా.. చిరు అవునని.. కాదని చెప్పకుండా నాన్చుతున్నట్టు భోగట్టా..!
ఇటు బాలయ్య మాత్రం చిరు గెస్టుగా వస్తే తన ప్రశ్నలతో ఆడుకునేందుకు రెడీగానే ఉన్నాడు. అయితే చిరు ఇటు ఎస్ అని.. అటు నో అని చెప్పడం ద్వారా తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నాడంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఒక వేళచిరు వస్తే ఏమయ్యా ఈ ప్రశ్న వేస్తున్నా ఆన్సర్ చెప్పాలి అని బాలయ్య అనగానే చిరు మొహమాటంతో అయినా ఓ ఎస్ అంటాడు. ఆ తర్వాత చిరంజీవికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేసి బాలయ్య సహజంగానే ఆటాడుకుంటాడు.
బాలయ్యకు అస్సలు మొహమాటం ఉండదు. ఎదుట చిరంజీవి ఉంటే స్క్రిఫ్ట్‌లో లేని ప్రశ్నలు కూడా వేయవచ్చు. అప్పుడు ఆ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేక ఇబ్బంది పడడం అవసరమా ? అన్న ఉద్దేశంతోనే చిరు ఈ షోకు రావడం లేదని టాక్ ? అయితే చిరంజీవికి అప్పట్లో ఓ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందన్న పుకార్లు ఉన్నాయి. ఆమె ఇప్పుడు చెన్నైలో ఉంటున్నారు. ఆమెతో బాలయ్యకు పరిచయం ఉంది.
ఒకవేళ బాలయ్య ఇదే ప్రశ్న వేసినా వేయవచ్చు. చిరు ఈ ఎపిసోడ్‌కు వస్తే బాలయ్య ఈ టైప్ ప్రశ్నలు ఖచ్చితంగా వేసే ఛాన్స్ ఉందనే చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
1- నీకు ఆ హీరోయిన్‌తో ఎఫైర్ ఉంది కదా ? ఆ కథ ఏంటో చెప్పు ?
2- నరసింహానాయుడుతో పోటీపడినప్పుడు మృగరాజు ప్లాప్ అయ్యింది.. ఆ సినిమా పోయినప్పుడు లోపల బాధపడ్డావట కదా ?
3- నెల్లూరు పొలాల్లో ఫ్లైట్ కూలిపోయినప్పుడు భయపడి ఘొల్లున ఏడ్చేశావా ? అప్పుడు ఏమనినిపించింది ?
ఇలాంటి చిలిపి ప్రశ్నలు కూడా బాలయ్య వేస్తాడు.. అప్పుడు ఇబ్బంది పడడం కంటే వెళ్లకపోవడమే మంచిదన్న భావనతో చిరంజీవి ఉన్నాడట. పైగా ఇప్పుడు వీరసింహారెడ్డి, వీరయ్య సినిమాల మధ్య పోటీ ఉంది. ఈ టైంలో ఫ్యాన్స్ అంతా ఒకమూడ్‌లో ఉంటారు.. దానిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకే చిరు ఈ షోకు వెళ్లట్లేదని టాక్ ? నిజంగానే వీరిద్దరు ఒకే వేదిక మీదకు వచ్చి చిలిపి ముచ్చట్లు చెప్పుకుంటే అంతకు మించిన ఆనందం ఏం ఉంటుంది.