తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ లో మొదట కమెడియన్ గా పేరు సంపాదించుకుని ఆ తర్వాత మెల్ల మెల్లగా ప్రొడ్యూసర్ గా మారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించి కోట్లల్లో లాభం అందుకున్నాడు . అయితే చేసిన సినిమాలు కన్నా నిర్మించిన మూవీస్ కన్నా ఎక్కువ కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేసే పాపులారిటీ సంపాదించుకున్న బండ్ల.. రీసెంట్గా అల్లు బ్రదర్స్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఓ ప్రైవేట్ ఫంక్షన్ కి అటెండ్ అయిన బండ్ల గణేష్ ..అదే ఫంక్షన్ కి అటెండ్ అయిన అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆయనతో కలిసి ఫంక్షన్ లో సందడి చేసిన బండ్ల గణేష్.. ఫోటోలు కూడా దిగారు . ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ..అల్లు బాబీని పరోక్షకంగా కించపరిచాడు.
“దయచేసి అందరికి చెప్తున్నాను వినండి ..తండ్రి మాట వింటే బాబిలా అవుతారు.. వినకపోతే బన్నీలా అవుతారు . ఈ మాటలను తప్పుగా తీసుకోకండి . చదువుకొని తండ్రి మాటలను విన్న అల్లు బాబు ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనందరికీ తెలుసు . అదే ప్రజెంట్ బన్నీ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో కూడా తెలుసు . ఇది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. తండ్రి మాట వినాలా వద్దా అన్న పాయింట్ కి .
ప్రతి ఒక్కరు సొంత నిర్ణయాలు తీసుకోవాలి “అని బండ గణేష్ చెప్పుకోచ్చారు. దీని పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి . అంతే కాదు దీనిపై కొందరు నెటిజన్స్ నిజంగానే అల్లు బాబి విషయంలో బండ గణేష్ చేసిన కామెంట్స్ ట్రూ అంటూ చెప్పుకొస్తున్నారు. ఆయన కెరియర్ నాశనం అయిపోవడానికి కారణం అల్లు అరవింద్ అంటూ మరోసారి ఆ పాయింట్ ని ట్రోల్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే బండ్ల గణేష్ నోటి దూకుడుకు ఈసారి అల్లు కొడుకు బలి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.