నందమూరి నట సింహం బాలకృష్ణ వచ్చే సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అఖండలాంటి కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో వీరసింహారెడ్డి పై భారీ అంచనాలు ఉన్నాయి. క్రాక్ లాంటి సూపర్ హిట్ తర్వాత మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య – అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బాలయ్య 109వ సినిమా కూడా లైన్లోకి వచ్చేసింది. గీతగోవిందం లాంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన యువ దర్శకుడు పరశురాం ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. సర్కారు వారి పాట సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యింది.
ఈ సినిమా తర్వాత పరశురాం ఇద్దరు ముగ్గురు టాలీవుడ్ యంగ్ హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అనూహ్యంగా ఆయన ఒక పొలిటికల్ లైన్ బాలయ్యకు చెప్పటం.. అది నటసింహంకు బాగా నచ్చేయటం జరిగింది. అయితే ఇప్పుడు బాలయ్య – పరశురాం సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. బాలయ్య క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట.
సినిమాలో ప్రజా పార్టీ అధినేత హోదాలో బాలయ్య ముఖ్యమంత్రిగా విజయం సాధిస్తారని… ఈ సినిమా సమకాలీన రాజకీయాలపై సెటైర్లతో ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా బాలయ్య – పరశురాం కాంబినేషన్ దాదాపు సెట్ అయింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. అనిల్ రావిపూడి సినిమా వచ్చే సమ్మర్ కు పూర్తి కానుంది. ఆ వెంటనే పరుశురాం – బాలుయ్య సినిమా సెట్స్ మీదకు వెళుతుందని తెలుస్తోంది. బాలయ్య ముఖ్యమంత్రి పాత్ర అనగానే ఆయన ఫ్యాన్స్‌కు అదిరిపోయే
పొలిటికల్ కిక్ వచ్చేసింది.