నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజుతో యేడాది పూర్తి చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావాలా ? వద్దా ? అన్న డౌట్లు, ఇటు పెద్ద హీరోలు తమ సినిమాలు రిలీజ్ చేయాలా ? వద్దా ? అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు వచ్చిన అఖండ బాక్సాఫీస్ దగ్గర అఖండ జ్యోతిలా వెలిగింది. ఎన్నో సంచలన రికార్డులు క్రియేట్ చేసింది. అఖండ క్రియేట్ చేసిన రికార్డులు, అఖండ అప్‌డేట్స్ గురించి కొన్నింటిని తెలుసుకుందాం.
1- బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో సింహా, లెజెండ్ తర్వాత వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ.
2- 6 డిసెంబర్ 2019లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాకు బీబీ 3 అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నారు.
3- ఈ సినిమాకు 13 ఏప్రిల్ 2021న అఖండ అనే టైటిల్ ఎనౌన్స్ చేశారు.
4- తొలి రోజు తొలి షో నుంచే సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది.
5- అఖండ నాలుగు కేంద్రాల్లో 100రోజులు ఆడగా.. అందులో ఒక్క కర్నూలు జిల్లాలోనే మూడు కేంద్రాలు ఉన్నాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కూడా 100 రోజులు ఆడింది.
6- సినిమా విజయంలో ఎం.రత్నం సంభాషణలతో పాటు థమన్ మ్యూజిక్ కూడా బాగా హైలెట్ అయ్యింది.
7- ఇక అఖండ షిఫ్టింగులతో కలుపుకుని 20 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
8- చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 175 రోజులు పూర్తి చేసుకుంది…
9- అఖండ 10 రోజుల్లో రు. 100 కోట్లకు పైగా బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
10- ఓవరాల్‌గా అఖండ థియేట్రికల్ ద్వారానే రు. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు.. నాన్ థియేట్రికల్ బిజినెస్ కలుపుకుని రు. 200 కోట్లు కొల్లగొట్టింది.
11- అఖండ ఫైనల్ రన్లో రు. 94 కోట్ల షేర్ రాబట్టింది.
12- అఖండ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్‌కు వచ్చి అక్కడ కూడా అదిరిపోయే రికార్డులు తన ఖాతాలో వేసుకుంది.
13- అఖండ రిలీజ్‌కు ముందు వరల్డ్ వైడ్‌గా రు. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్.
14- అఖండ రిలీజ్ అయిన 11 రోజుల పాటు వరుసగా కనీసం రు. కోటి షేర్‌కు తగ్గకుండా రికార్డు నమోదు చేసింది.
15- రిలీజ్ అయిన 25వ రోజు కూడా ఈ సినిమాకు రు. 50 లక్షల షేర్ వచ్చింది.
16- అఖండ ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్నాటకలోనూ ఆస్ట్రేలియా, అమెరికాలోనూ అర్ధశతదినోత్సవం జరుపుకుంది.
17- అఖండ ఫస్ట్ వీక్ కంప్లీట్‌గా హౌస్‌ఫుల్ నడిచింది. ఏ, బీ, సీ సెంటర్లు తేడా లేకుండా హౌస్‌ఫుల్స్ పడ్డాయి.
18- ఓటీటీలో రిలీజ్ అయిన 24 గంటల్లోనే 10 మిలియన్ల మంది ఈ సినిమాను వీక్షించారు.
19- ఇక ఈ సినిమా ఓటీటీకి వచ్చాక ఎప్పుడో 20 ఏళ్ల క్రిందట వీథి తెరలు కట్టి జనాలు ఎలా సినిమాలు చూసేవారో ఏపీ, తెలంగాణ, కర్నాటకలో మళ్లీ అలా వీథుల్లో తెరలు వేసుకుని ఊరి జనాలందరూ గుమికూడి అఖండను వీక్షించారు.
20- ఎప్పుడో 20 ఏళ్ల క్రిందట ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నరసింహానాయుడు సినిమాతో సింగిల్ థియేటర్లో కోటి రూపాయల వసూళ్లు రాబట్టిన బాలయ్య.. మళ్లీ 20 ఏళ్లకు అఖండతో ఆ ఫీట్ సాధించాడు. అఖండ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్లో 53వ రోజు మధ్యాహ్నంకు రు. కోటి గ్రాస్ వసూళ్లు సాధించింది.
21- అఖండ 25వ రోజు రెండు అరుదైన రికార్డులు సాధించింది. ఆ రోజు రు. 70 కోట్ల షేర్‌తో పాటు రు. 16 కోట్ల లాభాలు క్రాస్ చేసింది.
ఇలా ఒకటి రెండు కాదు… ఎన్నెన్నో అరుదైన రికార్డులు అఖండ తన ఖాతాలో వేసుకుంది.