భాగ్యనగరంలో నందమూరి ఫ్యామిలీకి రెండు థియేటర్లు ఉండేవి. ఒకటి తారకరామా 70 ఎంఎంతో పాటు రామకృష్ణ 70 ఎంఎం, 35 ఎంఎం థియేటర్లు ఉండేవి. ఇందులో ఎన్టీఆర్ పేరుతో పాటు ఆయన భార్య బసవతారకం పేరుతో తారకరామా థియేటర్ ఏర్పాటు చేశారు. నగరంలో తనకంటూ ఓ థియేటర్ ఉండాలన్న సంకల్పంతోనే ఆయన పట్టుబట్టి మరీ ఈ థియేటర్ నిర్మించారు. ఇక ఈ రోజు ఈ థియేటర్ ఏసియన్ తారకరామా పేరుతో రీ ఓపెన్ అయ్యింది.
డిసెంబర్ 16 నుంచి అవతార్ 2న ఇక్కడ రిలీజ్ చేయనున్నారు. 1978లో ఈ థియేటర్ ప్రారంభమైంది. ప్రారంభ సినిమాగా అక్బర్ సలీం అనార్కలీ రిలీజ్ చేశారు. మధ్యలో ఈ థియేటర్ ఆగిపోయింది. ఆ తర్వాత 1995లో దీనిని పునః ప్రారంభించారు. ఇక ఇప్పుడు అత్యాధునిక హంగులతో రీ ఓపెన్ అవుతోంది. తారకరామా థియేటర్‌కు నందమూరి ఫ్యామిలీకి చాలా సెంటిమెంట్ ఉంది.
బాలయ్య తనయుడు మోక్షజ్ఞ పేరును ఎన్టీఆర్ ఈ థియేటర్లోనే పెట్టారట. ఈ థియేటర్లో డాన్ 525 రోజులు ఆడింది. అలాగే బాలయ్య సినిమాలు కూడా ఎన్నో ఈ థియేటర్లో ఆడాయి. ఇక ఏసియన్ సంస్థ అధినేత నారాయణదాస్ నారంగ్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలకు ఫైనాన్షియర్. ఆ తర్వాత బాలయ్య సినిమాలకు కూడా ఆయనే ఫైనాన్షియర్‌గా ఉన్నారు.
అందుకే ఇప్పుడు ఏసియన్ వాళ్లతో టైఅప్ అయ్యి ఈ థియేటర్‌ను ఏషియన్ తారకరామా సినీ ఫ్లెక్స్ పేరుతో రీ ఓపెన్ చేస్తున్నారు. 975 సిట్టింగ్ కెపాసిటీ కలిగిన ఈ థియేటర్ సిట్టింగ్‌ను 590కు తగ్గించారు. రిక్లైనర్, సోపాలతో పాటు 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్‌తో ఈ థియేటర్‌ను రీ ఓపెన్ చేస్తున్నారు.