రికార్డులు సృష్టించాలన్నా… దానిని తిరగరాయాలన్నా మేమే అని బాలయ్య ఓ డైలాగ్ చెపుతాడు. బాలయ్య నటించిన సినిమాల రికార్డులు చూస్తే ఆ డైలాగ్ ఆయనకు అచ్చుగుద్దినట్టు సరిపోతుందనిపిస్తుంది. బాలయ్య తన కెరీర్‌లో ఇప్పటివరకు అఖండతో కలిపి 106 సినిమాల్లో నటించాడు. కెరీర్ ప్రారంభంలో తండ్రి ఎన్టీఆర్‌తో పాటు కలిసి ఎక్కువ సినిమాలు చేసిన బాలయ్య ఆ తర్వాత సోలో హీరోగా మారాడు.
బాలయ్య నటించిన 106 సినిమాల్లో ఏకంగా 72 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. టాలీవుడ్‌లో ఇలాంటి అరుదైన రికార్డ్ ఏ హీరోకు లేదు. భవిష్యత్తులో కూడా ఏ హీరోకు ఈ రికార్డ్ దక్కుతుందన్న ఆశలు కూడా లేవు. ఒక హీరో నటించిన 72 సినిమాలు ఏకంగా సెంచరీ కొట్టడం.. అందులోనూ రజతోత్సవ సినిమాలు, 200 రోజులు, స్వర్ణోత్సవం, ప్లాటినం జూబ్లీ ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.
ఒక్కసారి బాలయ్య కెరీర్‌లో ఎక్కువ రోజులు ఆడిన సినిమాల రికార్డుల లిస్టు చూద్దాం.
ఒకే థియేటర్లో రజతోత్సవ సినిమాలు :
1- మంగమ్మగారి మనవడు
2- ముద్దుల క్రిష్ణయ్య
3- సమరసింహారెడ్డి
4- నరసింహానాయుడు
5- సింహా
6- లెజెండ్
7- అఖండ
వీటితో పాటు కథానాయకుడు, రాము, లారీడ్రైవర్, రౌడీఇన్‌స్పెక్టర్ తదితర 10 సినిమాలు షిప్టింగులతో 25 వారాలు ఆడాయి.
ఒకే థియేటర్లో 200 ఆడిన సినిమాలు :
1- ముద్దుల క్రిష్ణయ్య
2- సమరసింహారెడ్డి
3- నరసింహానాయుడు
4- సింహా
5- లెజెండ్
స్వర్ణోత్సవ సినిమాలు:
1- మంగమ్మగారి మనవడు
2- ముద్దుల క్రిష్ణయ్య
3- ముద్దుల మావయ్య
4- సమరసింహారెడ్డి
5- నరసింహానాయుడు
6- లెజెండ్ ( డైరెక్ట్)
ప్లాటినం జూబ్లీ సినిమాలు:
1- మంగమ్మగారి మనవడు
2- లెజెండ్
– దక్షిణ భారతదేశ సినీ చరిత్రలోనే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలో ఫస్ట్ టైం 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన తొలి సినిమాగా నరసింహానాయుడు రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా 105 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.
– 400 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రం లెజెండ్. రెండు కేంద్రాల్లో డైమండ్ జూబ్లి జరుపుకున్న తొలి సినిమాగా లెజెండ్ రికార్డులకు ఎక్కింది.
– లెజెండ్ ప్రొద్దుటూరులో షిఫ్టింగ్‌తో కలుపుకుని ఏకంగా 1116 రోజులు ఆడింది. తెలుగులో ఏ సినిమా కూడా ఇన్ని రోజులు ఆడలేదు. ఇది ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్.