మెగాస్టార్ కు ఎలా వుందో తెలియదు కాని.. ఆయన అభిమానులకు, ఆయన పీఆర్ టీంకు జనవరి 13న తలుచుకుంటే చాలు గుండె లబ్‌డబ్ అంటోంది. ఈ సినిమా విడుదలయ్యాక రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ మాత్రమే కాదు.. ఎన్ని థియేటర్లు ఇస్తారు ? అసలు ఓపెనింగ్స్ ఎలా పడతాయి ? ఈ ఆలోచనలతో ఒక్కటే టెన్షన్‌గా ఉంది. ఎలా ఉన్నా బాలయ్య సినిమాతో పోలిస్తే మా హీరోదే పై చేయి ఉండాలని ఒక్కటే తాపత్రయ పడుతున్నారు.
ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నెగటివ్ టాక్ స్ప్రెడ్ కాకుండా… మంచి ఓపెనింగ్స్ పడేలా ఫ్యాన్స్, పీఆర్వోలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అటు నిర్మాతలు మైత్రీ మూవీస్ వాళ్ల టెన్షన్లు వాళ్లకు ఉన్నాయి. చిరు, బాలయ్య రెండు సినిమాలకు నిర్మాతలు వీళ్లే. అందుకే వీళ్లు ప్రమోషన్లు, ఇతరత్రా విషయంలో ఒకరికి ఎక్కువ.. ఒకరికి తక్కువ అన్న బాధ లేకుండా మీకేం కావాలో చూసుకోండి.. డబ్బులు మేం అరేంజ్ చేస్తామని చెప్పేశారట.
ఈ క్రమంలోనే జనవరి 8న విశాఖలో మెగాస్టార్ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇందుకోసం హైదరాబాద్ నుంచి ఓ స్పెషల్ ట్రైన్ నడపాలని చూస్తున్నారు. ఈ రైలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మీదుగా విశాఖకు వెళుతుంది. మొత్తం 20 బోగీల ద్వారా ఫ్యాన్స్‌ను అక్కడకు తరలించాలని పీఆర్ టీం ప్లాన్‌గా తెలుస్తోంది.
అయితే ఇది మెగాస్టార్ సీనియర్ అభిమానులకు నచ్చడం లేదట. మరీ రైళ్లు వేసి జనాలను తరలించుకునే దుస్థితిలో ఉన్నామా ? అని వారు ఫైర్ అవుతున్నారట. గతంలో ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఏకంగా మూడు ట్రైన్లు పెట్టి మరీ నిమ్మకూరుకు జనాలను తరలించి నానా హడావిడి చేశారు. కట్ చేస్తే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అందుకే ఇప్పుడు ఈ ట్రైన్ వేసి జనాలను తరలించే హడావిడి వద్దని మెగా సీనియర్ అభిమానులు చెపుతున్నారట అది సంగతి..!