సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజమో.. ఏ వార్త అబద్దమో చెప్పడం చాలా కష్టమైపోతుంది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అన్ని కచ్చితంగా అబద్దమా అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే సెలబ్రిటీస్ జీవితాల్లో జరిగే వార్తలు చాలా వరకు గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టేస్తారు . అలాంటివి సోషల్ మీడియాలోనే లీకై వాళ్ళ అభిమానులకు రీచ్ అవుతూ ఉంటాయి . అంత ఎందుకు ధనుష్ -ఐశ్వర్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ముందు సోషల్ మీడియాలోనే వార్తలు వినిపించాయి. సమంత – నాగచైతన్య విడిపోతున్నారని మూడు నెలల ముందు నుంచి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . ఆ తర్వాత ఫైనల్లీ వాళ్ళు తమ విడాకులను కన్ఫామ్ చేశారు .
అయితే రీసెంట్ గా రానా విషయంలో వైరల్ అవుతున్న న్యూస్ మాత్రం జనాలకు మింగుడు పడడం లేదు. టాలీవుడ్ స్టార్ వారసుడుగా రంగంలోకి దిగిన రానా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని.. ఆ కారణంగానే సినిమాలకు గుడ్ బాయ్ చెప్తున్నాడని ఓ న్యూస్ వైరల్ గా మారింది . దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రానా.. లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. భీమ్లా నాయక్ సినిమాతో స్టార్ విలన్ గా మారిపోయాడు. మరీ ముఖ్యంగా బాహుబలి సినిమాలో ప్రభాస్ కి ఎలాంటి క్రేజ్ వచ్చిందో ..విలన్ గా నటించిన రానాకు అంతే క్రేజ్ స్టార్ డం దక్కింది.
అయితే ఎందుకు రానా గత మూడు సంవత్సరాల నుంచి సినిమా కథలను వినడం లేదు ..? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆయన లాస్ట్ గా నటించిన సినిమా విరాటపర్వం . ఆ తర్వాత వెంకటేష్ తో వెబ్ సిరీస్ యాక్సెప్ట్ చేశారే కానీ ..అది ఆయన రేంజ్కి తగ్గది కాదని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎందుకు రానా డైరెక్టర్ అవకాశాలు ఇస్తున్న సినిమాలను దూరం పెడుతున్నాడు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు .
ఇలాంటి క్రమంలోనే దగ్గుబాటి రానాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని.. ఈ కారణంగానే ఆయన సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడని.. సమంత లాగే ఆయన కూడా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ..వన్స్ ఆయన ఆరోగ్యం పూర్తిగా సెట్ అయిన తర్వాత మళ్లీ సినిమాలోకి రియంట్రిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు రానా అఫీషియల్ గా స్పందించకపోవడం గమనార్హం. ఏది ఏమైనా సరే రానా ఇలాంటి విషయాలపై స్పందిస్తేనే అసలు నిజా నిజాలు బయటపడతాయి . ఆయన ఫ్యాన్స్ రిలాక్స్ అవుతారు . చూద్దాం మరి రానా ఏ విధంగా స్పందిస్తారో..?