2009లో రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా సెన్షేషనల్ క్రియేట్ చేసిన సినిమా అవతార్. ఎక్కడో అమెరికాలో రూపొందిన ఈ సినిమా యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించేసింది. అసలు అవతార్ క్రియేట్ చేసిన ప్రభంజనం మాటల్లోనే చెప్పలేం. అంటే 13 ఏళ్ల క్రితమే అప్పట్లో డాలర్ రేటు 50 ఉన్నప్పుడే ఈ సినిమాకు 2 కోట్ల బిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ వచ్చేంతవరకు కూడా ఈ సినిమా రికార్డులను చెరిపేసే హాలీవుడ్ సినిమాయే రాలేదు.
ప్రపంచాన్ని ఊపేసిన అంత గొప్ప సినిమాకు సీక్వెల్ తీయడానికి ఏకంగా 12 ఏళ్ల సమయం తీసుకున్నాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఇక అవతార్ 2 ఈ డిసెంబర్ 16న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది. మనదేశంలోనూ అవతార్ 2 మానియా అయితే మామూలుగా లేదు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఏకంగా రు 16.500 కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది.
ఇప్పటికే మన దేశంలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మళయాళ భాషల్లోనూ ఈ సినిమా మానియా ఊపేస్తుండగా.. అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్ములేపుతున్నాయి. 2డీ, 3డీ, ఐమాక్స్ ఫార్మాట్‌తో పాటు 4డీఎక్స్‌లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే మనం మరో ప్రపంచంలోకి వెళ్లిపోయినట్టుగా ఉంది. ఇక తెలుగులో ఈ సినిమాకు ప్రముఖ నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మాటలు రాస్తుండడంతో మంచి బజ్ వచ్చేసింది.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా కొన్ని చోట్ల ప్రీమియర్లు పడిపోయాయి. అమెరికా, ఫ్రాన్స్‌తో పాటు కొన్ని సెలక్ట్ చేసిన దేశాల్లో ఈ సినిమా ప్రీమియర్లు పడ్డాయి. సోషల్ మీడియా టాక్ కూడా బయటకు వచ్చేసింది. ప్రీమియర్ టాక్ అయితే అదిరిపోయిందని అంటున్నారు. జేమ్స్ కామెరూన్ సినిమా అంతా అదిరిపోయే ఎమోషన్స్‌తో నింపేశారట.
సినిమా చూస్తోన్న ప్రేక్షకులకు పండోరా గ్రహంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుందట. ఓ వైపు అనుభూతితో పాటు ఎమోషన్ సీన్లు వచ్చినప్పుడు ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటారట. ఏదేమైనా సినిమాకు యునానమస్ బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చేసింది. మరి ఇండియన్ భాషల నుంచే ఈ సినిమా రు. 2 వేల కోట్లు కొల్లగొడుతుందని అంచనాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో ? చూద్దాం.