Moviesఅభిమానులకి గుడ్ న్యూస్.. అనుపమ పెళ్లి కూతురు అయిపోయిందోచ్..!!

అభిమానులకి గుడ్ న్యూస్.. అనుపమ పెళ్లి కూతురు అయిపోయిందోచ్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హద్దుల మీరి నటించడం చాలా కామన్ ..అయితే తాను పెట్టుకున్న కండిషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఉండే రోల్స్ చేసుకుంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మల్టీ టాలెంట్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ఇప్పటివరకు అనుపమ హద్దులు మీరు నటించిన సినిమాలే లేవు . తాను పెట్టుకున్న కండిషన్స్ రూల్స్ ని ఏమాత్రం బ్రేక్ చేయకుండా తనదైన స్టైల్ లో నటించి మెప్పిస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ.

కాగా ఆమె లాస్ట్ గా నటించిన కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ కు బిగ్ స్టార్స్ ఆఫర్స్ ఇచ్చారు . వాటిల్లో తనకి ఇష్టమైనవి చూస్ చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గా అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది . రీసెంట్ గా ఆమె షేర్ చేసుకున్న ఫోటోలు అభిమానుల మనసును దోచేసుకున్నాయి.

ప్రజెంట్ సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఎలాంటి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు అందరికీ తెలిసిందే . అలాంటి టైం లోను నిండుగా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని అచ్చం పెళ్ళికూతురులా తయారైంది . దీంతో చాలా మంది ఆమె అభిమానులు అనుపమ పెళ్లికూతురు అయిపోయిందోచ్ అంటూ కామెంట్ చేస్తుంటే.. మరి కొందరు ఇంత అందంగా ఉన్నావ్ మరి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తావు అనుపమ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో అనుపమ పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే . అయితే అంత ఫేక్ అంటూ కొట్టి పడేసింది అనుపమ. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అనుపమకి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. కానీ ఆమె ఇప్పుడే అతని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదంటూ తెలుస్తుంది. ప్రజెంట్ హీరోయిన్స్ అనుపమను చూసుకొని చాలా నేర్చుకోవాలి అంటూ ఫ్యాన్స్ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news