Moviesమరో సినీ+క్రికెట్ ల‌వ్‌స్టోరీ... ఆ హీరోయిన్‌తో రుతురాజ్ గైక్వాడ్ డీప్ ల‌వ్‌...!

మరో సినీ+క్రికెట్ ల‌వ్‌స్టోరీ… ఆ హీరోయిన్‌తో రుతురాజ్ గైక్వాడ్ డీప్ ల‌వ్‌…!

సినిమా వాళ్ల‌కు, క్రికెట‌ర్ల‌కు మ‌ధ్య విడ‌దీయ‌రాని లింక్ ఉంటుంది. ఈ లింక్ ఈ నాటిదికాదు.. 40 – 50 ఏళ్ల నుంచి కొనసాగుతూనే వ‌స్తోంది. బాలీవుడ్ హీరోయిన్ల‌ను స్టార్ క్రికెట‌ర్లు ల‌వ్‌లో ప‌డేసి.. డేటింగ్‌లు చేయ‌డం ఎప్పుడో ప్రారంభ‌మైంది. కొంద‌రు హీరోయిన్లు, స్టార్ క్రికెట‌ర్లు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. వివియ‌న్ రిచ‌ర్డ్స్ – నీనా గుప్తా ప్రేమాయ‌ణం అప్ప‌ట్లో సంచ‌ల‌నం.. ఆ త‌ర్వాత సంగీత బిజ్లానీ – అజారుద్దీన్ ల‌వ్‌, పెళ్లి, మ‌ధ్య‌లో మాధురి దీక్షిత్ – అజ‌య్ జ‌డేజా, క‌పిల్‌దేవ్ – సారిక బ్రేక‌ప్‌లు కూడా సంచ‌ల‌న‌మే అయ్యాయి.

ఇటీవ‌ల కోహ్లీ – అనుష్క‌శ‌ర్మ పెళ్లి చేసుకున్నారు. కేఎల్‌. రాహుల్‌, అతియాశెట్టి డేటింగ్‌, ఇప్పుడు ఈ వ‌రుస‌లోనే యంగ్ క్రికెట‌ర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ న‌టిమ‌ణి మ‌ధ్య డేటింగ్‌, ఎఫైర్ వార్త‌లు నేష‌న‌ల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఆ న‌టీమ‌ణి ఎవ‌రో కాదు మ‌రాఠి న‌టీమ‌ణి స‌యాలీ సంజీవ్‌. వీరిద్ద‌రి మ‌ధ్య కొంత కాలంగా ఏదో ఉంద‌ని పుకార్లు షికార్లు అయితే చేస్తున్నాయి.

వీటిపై స‌యాలీ స్పందించింది. మా మ‌ధ్య ఏం లేదు.. మీ రూమ‌ర్ల వ‌ల్లే మా స్నేహం కూడా దెబ్బ‌తింద‌ని వాపోయింది. మా మ‌ధ్య ప్రేమా లేదు.. దోమా లేదు.. ఇప్పుడు రూమ‌ర్ వార్త‌ల‌తో క‌నీసం మాట్లాడుకోలేని ప‌రిస్థితి ఉంద‌ని తెలిపింది. మ‌మ్మ‌ల‌ను ఎందుకు ? లింక్ చేస్తున్నారో అర్థం కావ‌డం లేదు.. దీని వ‌ల్ల మా వ్య‌క్తిగ‌త జీవితాల్లో చాలా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని చెప్పింది.

రుతురాజ్ మంచి క్రికెట‌ర్‌.. మేం దాని గురించే మాట్లాడుకునేవాళ్లం.. ఇప్పుడు అది కూడా చేయ‌డం మానేశాం… ఈ పుకార్లు ఇలా వ్యాప్తి చెందుతూ ఉంటే ఎప్ప‌ట‌కి అయినా ఇబ్బందే అని మేం భావించాం అని.. ఇంట్లో వాళ్ల‌కు కూడా ఇబ్బందులు వ‌స్తాయ‌నే ఒక‌రినొక‌రు అర్థం చేసుకునే దూరంగా ఉంటున్నాం.. ఏదైనా విజ‌యం సాధించిన‌ప్పుడు మాత్ర‌మే కంగ్రాట్స్ చెప్పాల‌ని అనిపించినా.. ఇప్పుడు అది కూడా చేయ‌లేని ప‌రిస్థితి ఉంద‌ని ఆవేద‌న‌తో క్లారిటీ ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news