బుల్లితెరపై యాంకర్ లాస్యకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . కెరియర్ స్టార్టింగ్ లో చాలా కష్టాలు పడిన లాస్య.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ ..మరో యాంకర్ రవితో కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు . సంథింగ్ స్పెషల్ అనే షో తో బాగా పాపులారిటీ సంపాదించుకున్న లాస్య ..తర్వాత తనదైన స్టైల్ లో ఈవెంట్లకి, అటెండ్ అవుతూ పలు స్టార్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ.. యాంకరింగ్ చేస్తూ తనదైన స్టైల్ లో గుర్తింపు సంపాదించుకుంది .
అదే టైంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన మంజునాధ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న లాస్య.. గురించి అందరికీ తెలిసిందే. ప్రజెంట్ రెండో సారి గర్భం దాల్చిన లాస్య రీసెంట్ పోస్ట్ సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే లాస్య తన భర్త మంజునాథ్ ని టార్ గెట్ చేసి.. తన ప్రేగ్నెన్సీ బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ.. “పీరియడ్స్ బాధలు తట్టుకోలేకపోతున్నాను అని ..మంజునాథ్ కి చెప్పగానే ఇలా తొమ్మిది నెలలు నాకు పీరియడ్స్ పాస్ చేశాడు” అని ఫన్నీగా చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలోని లాస్య రియాక్ట్ అయిన తీరు జనాలను నవ్విస్తుంటే.. మరి కొంత మంది మంజునాధ్ ను వల్గర్ ట్రోల్ చేస్తున్నారు . అంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక తొమ్మిది నెలలు పీరియడ్స్ పాస్ చేస్తావా..? మంజునాథ్ అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే లాస్య సరదాగా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.