ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. టాలీవుడ్ లో ఓ పెద్ద సినిమా వస్తోందంటే అసలు రకరకాల వార్తలు వచ్చేస్తుంటాయి. సినిమా బడ్జెట్, రెమ్యునరేషన్లు, ప్రి రిలీజ్ బిజినెస్ లెక్కలు, కోట్లలోనే నడుస్తూ ఉంటాయి. అయితే పుష్ప సాధించిన అప్రతిహత విజయంతో ఇప్పుడ పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు, భారీ లెక్కలు బయటకు వస్తున్నాయి. అసలు ఈ లెక్కలు వింటుంటే వామ్మో అనాలో, వావ్ అనాలో కూడా అర్థం కావడం లేదు.
సక్సెస్ అయితే వచ్చేది ఎంత ? అన్నది పక్కన పెడితే తేడా వస్తే మాత్రం పాతాళంలోకి వెళ్లిపోవాల్సిందే. పుష్ప 2 సినిమాకు బడ్జెట్ 400 – 500 కోట్ల మధ్యలో అవుతుందని లెక్కలు వేస్తున్నారు. పుష్ప బాలీవుడ్‌లో అంచనాలు లేకుండానే రు. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో మేకర్స్ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదని అర్థమవుతోంది.
వీళ్లు రు. 100 కోట్ల లాభం టార్గెట్‌గా పుష్ప 2పై ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నారట. ఇక రెమ్యునరేషన్లు కూడా షాకింగ్‌గానే ఉన్నాయి. బన్నీకి రు. 100 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు 30 శాతం లాభాల్లో వాటా ఇస్తున్నారట. ఇక దర్శకుడు సుకుమార్‌కు కూడా రు. 25 కోట్లతో పాటు లాభాల్లో 30 శాతం వాటా అంటున్నారు. ఇక నిర్మాతలకు 40 శాతం లాభాలు మిగులుతాయి.
ఈ లెక్కలు చూస్తే తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా బన్నీయే నిలుస్తాడు. రు. 100 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో 30 శాతం వాటా అంటే రు. 130 కోట్ల రెమ్యునరేషన్ అవుతుంది. ఇక సినిమా పూర్తి షూటింగ్ ఏప్రిల్ నుంచి ఉంటుందని.. సినిమా రిలీజ్ 2023 డిసెంబర్ లేదా 2024 సంక్రాంతి / సమ్మర్‌కు ఉంటుందని అంటున్నారు.
ఇక పై లెక్కుల అన్నీ సినిమా హిట్ అయ్యి లాభాలు వస్తేనే.. అంటే పుష్పను మించి పుష్ప 2 హిట్ అవ్వాలి.. ఏ మాత్రం తేడా వచ్చినా బన్నీ, సుకుమార్‌కు పోయేదేం ఉండదు.. వాళ్ల రెమ్యునరేషన్ వాళ్లకు వస్తుంది. తేడా వస్తే మైత్రీ వాళ్లు అధః పాతాళంలోకి వెళ్లిపోతారు.