యాక్టింగ్ చేతకాకపోయినా ఆ ఒక్క ఆఫర్ ఇచ్చి అవకాశాలు అందుకుంటున్న హీరోయిన్స్. అవును గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న హీరోయిన్స్‌లో చాలామందికి యాక్టింగ్ రాదనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు చూస్తే అది నిజమని మనకీ అర్థమవుతుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తే సావిత్రి, జమున, అంజలీ దేవి, కాంచన లాంటి వారు ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించేవారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆ తర్వాత తరం హీరోయిన్స్ విజయశాంతి, రాధ, సుహాసిని, మాధవి, సుమలత భానుప్రియ లాంటి వారు తమ పర్ఫార్మెన్స్‌తో మంచి స్టార్ డం ని సంపాదించుకున్నారు. ఇక నెక్స్ట్ జనరేషన్‌లో సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, రాశి, సిమ్రాన్, సంఘవి, మీనా, రోజా లాంటి గ్లామర్ హీరోయిన్స్ కూడా అదరగొట్టారు. కానీ, ఈ జనరేషన్ తర్వాత వచ్చిన హీరోయిన్స్ మాత్రం అందచందాలతో మాత్రమే నెట్టుకొస్తున్నారు.
సమంత, కీర్తి సురేష్, నయనతార, త్రిష, తమన్నా, రష్మిక మందన్న, పూజా హెగ్డే బాగా పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ ఎక్కడో ఇంకా జనాలను మెప్పించలేకపోతున్నారు. ఉన్నవారిలో మాత్రం వీరు బెస్ట్ అనిపించుకున్నారు. ఇప్పుడు వీరందరికీ దాదాపు పాన్ ఇండియన్ హీరోయిన్స్ అనే క్రేజ్ ఉంది. అయితే, కొందరు మాత్రం కేవలం రొమాంటిక్ హీరోయిన్స్‌గా ఫిక్సైపోతున్నారు.
యాక్టింగ్ అనేది వీరిలో చాలా తక్కువ శాతమే కనిపిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ సాధించిందో అందరికీ తెలిసిందే. కానీ, హీరోయిన్‌గా నటించిన శాలినీ పాండే అడ్రస్ లేదు. పాయల్ రాజ్‌పుత్ అలా అలా నెట్టుకొస్తోంది. నిధి అగర్వాల్, నభా నటేష్‌ల కెరీర్ కూడా నత్త నడకలా సాగుతోంది.
ఈ జనరేషన్ హీరోయిన్స్ కొందరు అవకాశాల కోసం యాక్టింగ్ రాకపోయినా మేకర్స్‌కి రెమ్యునరేషన్ విషయంలో వెసులుబాటు చూపించి అలాగే సినిమా నిండా ఎన్ని లిప్ కిస్ సీన్స్ ఉన్నా, ఎన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నా ఒకే అని ముందే చెప్పేసి ఛాన్సులు పట్టేస్తున్నారు. కానీ, వీరు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగడం లేదు.