చాలా సంవత్సరాల తర్వాత ..ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద ఇద్దరు స్టార్ హీరోలు టఫ్ ఫైట్ ఇచ్చుకోబోతున్నారు. మనకు తెలిసిందే గోపీచంద్ డైరెక్షన్లో నందమూరి బాలయ్య వీర సింహారెడ్డిగా జనవరి 12వ తేదీ థియేటర్స్లోకి రానున్నారు . కాగా ఆ సినిమా రిలీజ్ అయిన పక్క రోజే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాబి డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య గా థియేటర్స్ లో సందడి చేయనున్నారు . ఇలా పక్కపక్క రోజుల్లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫిస్ వద్ద టఫ్ ఫైట్ ఇచ్చుకుంటున్నారు. దీంతో ఈ సంక్రాంతి మరింత రసవత్తరంగా మారబోతుంది అంటూ జనాలు చెప్పుకుంటున్నారు.
కాగా ఇప్పటికే రెండు సినిమాలను కంపేర్ చేస్తూ మేగా- నందమూరి ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు . ఇదే క్రమంలో మెగా స్టార్ వాల్తేరు వీరయ్య నుంచి క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలో ఎప్పుడు హద్దులు మీరి నటించలేదు ..వల్గర్ సీన్స్ ..బోల్డ్ సీన్స్ అస్సలు చేయలేదు. రొమాన్స్ చేసినా కానీ అది పద్ధతిగా హద్దుల్లో ఉండేది ..ఫస్ట్ టైం సెకండ్ ఇన్నింగ్స్ లో హిట్ కోసం వాల్తేరు వీరయ్య ఘాటు లిప్ లాక్ కి ఓకే చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .
అయితే ఇక్కడ లిప్ లాక్ చిరంజీవి చేయలేదట. ఆ సినిమాల్లో మరో హీరోగా నటిస్తున్న మాస్ మహారాజ రవితేజ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది . మనకు తెలిసిందే బాబి డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి టఫ్ కాంపిటీషన్ ఇస్తూ మరో పాత్రలో కనిపించబోతున్నాడు మాస్ మహారాజ రవితేజ . ఈయనకు హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ కేధరిన్ నటిస్తుంది. వీళ్ల మధ్యలో మంచి రొమాంటిక్ సీన్స్ ఉంటాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నేటి యువతను ఆకట్టుకునే విధంగా పంచ్ డైలాగ్స్ తో పాటు కుర్రాలను ఆకట్టుకునే లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయట. అయితే ఇలాంటి సీన్స్ తన సినిమాలో ఎప్పుడు పెట్టుకొని చిరంజీవి సైతం బాబి మాటలకు మెల్ట్ అయ్యి ఓకే చెప్పాడని తెలుస్తుంది. సినిమాలో ఆ సీన్స్ పెట్టేముందు చిరంజీవి పర్మిషన్ తీసుకున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి, మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో వీరయ్య ఎలాంటి పార్టీ ఇస్తాడో..?