అన్ స్టాపుబుల్ టాక్ షో 2 సంచలనాలకు కేంద్రం అవుతుంది. నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోకు తాజాగా యంగ్ హీరోలు అడవి శేషు, శర్వానంద్ గెస్టులుగా హాజరయ్యారు. వీరిద్దరికీ పలు ప్రశ్నలు వేసిన బాలయ్య చాలా సరదాగా టాక్ షో నడిపించారు. అయితే ఈ టాక్ షోలో అటు బాలయ్యతో పాటు ఇటు అడవి శేషు, శర్వానంద్ కు సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే బాలయ్య తండ్రి విశ్వవిఖ్యాత నట సౌర్వభౌమ ఎన్టీఆర్‌కు శర్వానంద్ కు ఉన్న బంధం కూడా బయటకు వచ్చింది.
ఈ టాక్ షోలో శర్వానంద్ మాట్లాడుతూ తనది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాదని… తన తండ్రి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకోకుండా తన కాళ్లపై తాను నిలబడాలనుకున్న సమయంలో సినిమా పరిశ్రమను కెరీర్ గా ఎంచుకున్నానని శర్వానంద్ చెప్పాడు. తాను హీరోగా చేసిన తొలి సినిమా ఆడలేదని.. ఆ తర్వాత సహాయ నటుడిగా కొన్ని సినిమాల్లో నటించి.. తిరిగి హీరోగా నిలదొక్కుకున్నానని శర్వానంద్ చెప్పాడు.
కష్టపడితే ఎప్పటకి అయినా ఓ స్థాయికి వెళతానన్న నమ్మకం ఉండేదని.. దర్శకులు చెప్పిన కథల్లో మంచి కథలు ఎంపిక చేసుకుని.. హీరోయిన్ల చాయిస్ కూడా దర్శకులదే ( నవ్వుతూ) అని చెప్పాడు. అలాగే బాలయ్య ఈ షోలో మహాసముద్రం హీరోయిన్ అదితి రావు హైదరీ విషయం తీసుకురాగా.. సిద్ధుకు, అదితికి మధ్య ఏం ఉందో తనకు తెలియదని.. అయితే సోషల్ మీడియాలో సిద్ధు పెట్టిన పోస్ట్‌ను తాను చూశానని చెప్పాడు.
ఇక బాలయ్య నీ ఫోన్లో హీరోయిన్లకు ముద్దులు పెట్టిన వీడియోలు ఎన్ని ఉన్నాయని ప్రశ్నించాడు. అయితే శర్వానంద్‌కు ఆసక్తికరమైన రిప్లేతో బాలయ్యకు షాక్ ఇచ్చాడు. సార్ మీ నాన్న గారి దగ్గర మా తాతయ్య అక్కౌంటెంట్‌గా పనిచేశారు.. నా దగ్గర మీకు సంబంధించిన వివరాలు అన్నీ ఉన్నాయి.. అవి కూడా చెప్పమంటారా ? అని అనడంతో వెంటనే బాలయ్య మిమ్మలను షోకు పిలిచి తప్పు చేశానయ్యా ? అనడంతో వెంటనే నవ్వులు పూశాయి.