పక్కా హైదరాబాదీ హీరోయిన్స్ మన ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉన్నారు. టబు హైదరాబదీనే. ఇప్పటి ఇస్మార్ట్ బ్యూటీ..నిధి అగర్వాల్‌ది కూడా హైదరాబ్దే. అలాగే దియా మీర్జాది హైదరాబాద్. వీరికంటే సీనియర్ నటీమణి మెగాస్టార్ చిరంజీవికి సూపర్ జోడీ అనిపించుకున్న మాధవిది కూడా హైదరాబాద్. అచ్చ తెలుగమ్మాయి. సాధారణంగా తెలుగమ్మాయిలకి ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వరంటూ ఇప్పటి నటీమణులు కొందరు వాపోతున్నారు.
కానీ, అప్పట్లో చాలామంది నటీమణులు మన తెలుగువారే. మరి జనరేషన్ మారేసరికి మన మేకర్స్‌లో ఇంత భారీ మార్పు ఎందుకొచ్చిందో గానీ, నిజంగానే హీరోయిన్స్ విషయానికొచ్చే సరికి తెలుగమ్మాయిలకి అవకాశాలివ్వడం లేదు. నచ్చావులే లాంటి సూపర్ హిట్ సినిమాతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకున్న మాధవీ లత ఆ తర్వాత అగ్ర తారగా వెలగకపోవడానికి కారణం మన మేకర్స్ అని ఆమె చాలా సందర్భాలలో వాపోయింది.
ఇలాంటి యంగ్ టాలెంటెడ్ హీరోయిన్స్ చాలామందికి అవకాశలు వస్తున్నాయి గానీ, పరభాషా హీరోయిన్స్ రష్మిక మందన్న, పూజా హెగ్డే లాంటి వారిలా స్టార్ స్టేటస్ అందుకోలేకపోతున్నారు. ఇక సీనియర్ హీరోయిన్ మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంది. ఆమె ఎంత మంచి పర్ఫార్మరో అందరికీ తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవికి సాలీడ్ హిట్ పేయిర్. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకున్నాయి.
ఆ జనరేషన్ హీరోయిన్స్ చాలామంది ఇప్పుడు మళ్ళీ మొహానికి రంగేసుకొని అమ్మ, వదిన పాత్రలలో కనువిందు చేస్తున్నారు. కానీ, ఇండస్ట్రీలో ఉన్న దర్శకనిర్మాతలతో హీరోలతో మంచి అనుబంధం ఉన్న మాధవీ మాత్రం తెర మరుగైపోయారు. కారణం తను కెరీర్‌ను పూర్తిగా తన కుటుంబానికి అంకితం చేయడమే. ఇదే మాట ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది.
కనీసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా అందుబాటులో లేరు. విదేశాలలో సెటిలయ్యారు. నటన కావాలంటే మళ్ళీ తను హైదరాబ్ద్ రావాల్సి ఉంటుంది. ఇప్పట్లో అది కుదరని పని. పైగా మాధవిని ఎవరూ సంప్రదించలేదనే టాక్ కూడా ఓ వైపు వినిపిస్తుంది. అందుకే, ఆమె మిగతా సీనియర్ నటీమణుల మాదిరిగా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడం లేదు.